ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమపేరుతో ముగ్గులోకి దింపి రెండు రోజుల్లోనే..!

ABN, First Publish Date - 2021-03-25T13:35:34+05:30

సోషల్‌ మీడియాలో పరిచయం పెంచుకుని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : సోషల్‌ మీడియాలో పరిచయం పెంచుకుని మోసాలకు పాల్పడుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నగర కమిషనరేట్‌ పరిధిలో రోజుకు మూడు నుంచి నాలుగు కేసులు సైబర్‌క్రైమ్స్‌లో నమోదవుతున్నాయి. పంజాగుట్టలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ యువకుడు ఇలాగే మోసపోయి రూ.25వేలు సమర్పించుకున్నాడు. ఎఫ్‌బీలో ఓ యువతి ద్వారా స్నేహం చేసి ప్రేమపేరుతో ముగ్గులోకి దింపి రెండు రోజుల్లోనే న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేసుకునేంత వరకు తీసుకెళ్లింది. అమ్మాయి తనతో న్యూడ్‌గా వీడియోకాల్‌ మాట్లాడటంతో యువకుడు ఆమె చెప్పినట్లే చేశాడు. ఆ వీడియోలను రికార్డ్‌ చేసిన యువతి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేయడంతో అడిగినంత ఇచ్చుకున్నాడు. రెండోసారి కూడా మరో యాబైవేలు కావాలని డిమాండ్‌ చేయడంతో సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.


ఎంతో మంది..!

కాగా.. ఇదొక్కటే కాదు ఇలాంటి సమస్యలు.. ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నేపథ్యం ఉన్నవారు, ఐటీ ఉద్యోగులు, సంపన్నులు ఇలాంటి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి గిలగిలా కొట్టుకుంటున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అంటున్నారు. నగ్న, అర్ధనగ్న ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడితే సమాజంలో ఎక్కడ చులకనైపోతామోనని భయపడి నేరగాళ్లు అడిగినంత డబ్బు ముట్టజెప్పుతున్నారు.  పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం లేదని పోలీసులు అంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-03-25T13:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising