ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టూడెంట్‌పై అత్యాచారం.... ex-MLAకి జైలుశిక్ష

ABN, First Publish Date - 2021-10-31T21:27:34+05:30

కళాశాల విద్యార్థినిపై 13 ఏళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బహుజన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరేలి: కళాశాల విద్యార్థినిపై 13 ఏళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) మాజీ ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్‌కు బుదాన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధిత కుటుంబానికి రూ. 30 వేలను పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. యువతి అత్యాచారానికి గురైన సమయంలో ఆమె వయసు 20 సంవత్సరాలు. 2008లో ఆమెను అపహరించి ఆపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.


ఈ కేసులో యోగేంద్రసాగర్ సహ నిందితుడిగా ఉన్నారు. నిందితుడు సాగర్‌కు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు ఆ తర్వాత కేసును మూసివేశారు. అయితే, 2010లో సెన్షన్స్ కోర్టు ఆదేశాలతో కేసును తిరిగి తెరిచారు. ఆ తర్వాత ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో త్వరితగతిన పరిష్కరించేందుకు బుదాన్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల కోర్టుకు బదిలీ చేశారు.


శనివారం ఈ కేసులో తుదితీర్పు వెల్లడైంది. నిందితుడు యోగేంద్ర సాగర్‌ను దోషిగా తేల్చిన అదనపు జిల్లా న్యాయమూర్తి అఖిలేశ్ కుమార్ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే, 30 వేల రూపాయల జరిమానా విధించారు. ఆ సొమ్మును బాధిత కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలని ఆదేశించారు. యోగేంద్ర సాగర్ కుమారుడు ప్రస్తుతం బుదాన్‌లోని బిసౌలి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 

Updated Date - 2021-10-31T21:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising