ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీళ్లు మామూలోళ్లు కాదు.. ఒక్క ఫోన్‌కాల్‌తో మాజీ పోలీస్ అధికారి దగ్గరే రూ.89 వేలు కొట్టేశారు.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-10-15T19:00:26+05:30

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తుంటారు. అయితే అన్నీ తెలిసిన ఓ మాజీ పోలీసు బాస్‌నే సైబర్ కేటుగాడు బురిడీ కొట్టించాడు. చివరకు ఆయన బ్యాంక్ అకౌంట్‌లోని రూ.89వేలను మాయం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బ్యాంక్‌లోని నగదు ఖాళీ చేసేస్తారు. కొత్త కొత్త ప్లాన్‌లు వేస్తుండడంతో చదువుకున్న వారు సైతం మోసపోతున్నారు. చివరకు తాము మోసపోయామని తెలుసుకుని.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తుంటారు. అందుకే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తుంటారు. అయితే అన్నీ తెలిసిన ఓ మాజీ పోలీసు బాస్‌నే సైబర్ కేటుగాడు బురిడీ కొట్టించాడు. చివరకు ఆయన బ్యాంక్ అకౌంట్‌లోని రూ.89వేలను మాయం చేశాడు. వివరాల్లోకి వెళితే.. 


కర్ణాటకలో మాజీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌ ఎంబీ శంకర్.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు. అక్టోబర్ 11న ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి..‘‘ సార్.. మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం.. మీ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోండి’’.. అంటూ సూచించారు. వారి మాటలు నిజమే అని నమ్మిన శంకర్.. తనకు సంబంధించిన వివరాలన్నీ చెప్పేశాడు. తర్వాత వివరాలను అప్‌డేట్ చేస్తున్నామని, ఓటీపీ చెప్పాలని మెసేజ్ చేశారు.


వారికి పాస్‌వర్డ్ చెప్పిన కొద్ది సేపటికి.. అతడి బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న రూ.89వేలు మాయమయ్యాయి. తర్వాత విషయం తెలుసుకుని మాజీ పోలీసు బాస్ కంగుతిన్నారు. వెంటనే సౌత్ ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇదే మాజీ పోలీస్ అధికారి.. ఈ ఏడాది మార్చిలో కూడా సైబర్ మోసానికి బలైనట్లు తెలిసింది. ఆయన ఈమెయిల్‌ను హ్యాక్ చేసిన మోసగాళ్లు.. తద్వారా రూ.25,000 కొట్టేశారని సమాచారం.

Updated Date - 2021-10-15T19:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising