ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాలకు ఇలా చెక్ పెట్టేయొచ్చు!

ABN, First Publish Date - 2021-04-23T19:41:08+05:30

అధునిక సమాజంలో ఆర్థిక లావాదేవీలు, ఆయా కార్యాలయాల్లో గణాంకాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అల్వాల్‌ : అధునిక సమాజంలో ఆర్థిక లావాదేవీలు, ఆయా కార్యాలయాల్లో గణాంకాలు, అత్యంత విలువైన సమాచార సేకరణతో పాటు ఆ సమాచారాన్ని స్టోర్‌ చేసుకోవడం, వాటికి సంబంధించిన గోప్యత మొత్తం కంప్యూటర్లలోనే నిక్షిప్తమవుతుంది. కంప్యూటర్‌ను ఓపెన్‌ చేయడంతో పాటు, ఏటీఎం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వాడకాల్లో గోప్యతకోసం పాస్‌వర్డ్‌ అత్యంత కీలకం. అందుకే పాస్‌వర్డ్‌ తయారు చేసుకోవడంతో పాటు దాన్ని గోప్యంగా ఉంచుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఇటీవల కాలంలో సైబర్‌నేరాలు పేరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. సైబర్‌ నేరాలు జరిగిన వెంటనే పోలీస్లకు ఫిర్యాదు చేస్తే నేరాలను అరికట్టే అవకాశం ఉంటుంది.


గోప్యంగా ఉంచాలి

పాస్‌వర్డ్‌ను స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి. సులభంగా గుర్తుపట్టేలా ఉండకూడదు. ఇంటి పేరు, పిల్లల ముద్దు పేర్లతో, జన్మదినాల పేరుతో పాస్‌వర్డ్‌ తయారు చేసుకోవద్దని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి వాటిని సైబర్‌ నేరస్తులు సులభంగా గుర్తిస్తారని పేర్కొంటున్నారు. తరుచూ పాస్‌వర్డ్స్‌ను  మార్చితే మంచిది. 


జాగ్రత్తలు పాటించాలి

  • కంప్యూటర్లు, నెట్‌ బ్యాకింగ్‌ వాడేవారు, ఎటీఎం, డెబిట్‌ క్రెడిట్‌ కార్డులతో లావాదేవీలు నిర్వహించేవారు పాస్‌వర్డ్స్‌ను  తరుచుగా మారుస్తూఉండాలి. 

  • దగ్గరి బంధువులు సైతం పాస్‌వర్డ్‌ తెలుసుకుని డబ్బులను కాజేస్తూ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది.సైబర్‌ నేరాల నివారణలో భాగంగా పాస్‌వర్డ్‌ వాడకంపై జాగ్రత్తలు పాటించాలి. సైబర్‌ సెక్యూరిటీపై డయల్‌ 100కు ఫిర్యాదుచేయాలి. - పద్మజారెడ్డి డీసీపీ బాలనగర్‌జోన్‌.

Updated Date - 2021-04-23T19:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising