ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-19T22:31:43+05:30

నగరంలో నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నగర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో నకిలీకరెన్సీని ముద్రిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేసామన్నారు. వారి దగ్గర నుంచి నకిలీ 500 రూపాయల 1500 నోట్లను సీజ్ చేశామన్నారు. అలాగే 9 లక్షల విలువ చేసే రద్దైన 500 రూపాయల నోట్లను సీజ్ చేశామన్నారు. ముఠాలోని ప్రధాన నిందితుడు సిద్దిపేటకి చెందిన సంతోష్ కుమార్‌తో పాటు  బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుంకర శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. ఈ ముద్రించిన నోట్లలలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కమిషన్ తీసుకున్నాడన్నారు. మొత్తం 26 లక్షలు విలువైన నోట్లను ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.


క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గుజరాత్‌లో శ్రీనివాస్‌ను అధికారులు డిస్మిస్ చేసారన్నారు. కానిస్టేబుల్ శ్రీనివాస్‌ కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయన్నారు. దీంతో ఈజీగా డబ్బులు సంపాదించాలని ఈ ముఠాతో శ్రీనివాస్‌ చేతులు కలిపాడని సీపీ పేర్కొన్నారు. ముఠా సభ్యులు నకిలీ నోట్లు తయారు చేస్తే శ్రీనివాస్‌ వాటిని చలామణి చేసేవాడన్నారు. వచ్చిన దాంట్లో శ్రీనివాస్‌ కొంత కమిషన్ తీసుకునేవాడని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 

Updated Date - 2021-08-19T22:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising