ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటవాడిగా చేరి ఏం చేశాడో చూడండి..!

ABN, First Publish Date - 2021-02-23T13:42:28+05:30

. ప్రకాశం జిల్లా నూతనపాడు మంగనూర్‌ గ్రామానికి చెందిన తన్నీరు లక్ష్మీనారాయణ(27) ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : పని ఇచ్చిన యజమాని ఇంట్లోనే చోరీ చేసి.. పని మానేసి పరారీలో ఉన్న నిందితుడిని రాచకొండ సైబర్‌క్రైం సిబ్బంది అరెస్ట్‌ చేశారు. ప్రకాశం జిల్లా నూతనపాడు మంగనూర్‌ గ్రామానికి చెందిన తన్నీరు లక్ష్మీనారాయణ(27) వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలో నివసిస్తున్నాడు. వనస్థలిపురంలో ఉండే ఓ మహిళ ఇంట్లో వంటవాడిగా చేరాడు. ఖర్చుల నిమిత్తం ఆమె సోదరి అమెరికానుంచి డబ్బులు పంపేది. ఆమె బ్యాంకు డెబిట్‌కార్డు కవర్‌పై పిన్‌ నెంబర్‌ రాసి కార్డును ఎప్పుడూ తన టేబుల్‌పై ఉంచుకునేది. ఈ విషయం గమనించిన లక్ష్మీనారాయణ డెబిట్‌కార్డును జనవరి 2020 నుంచి పలుమార్లు తస్కరించి ఏటీఎం నుంచి రూ. 2.70 లక్షలు తీసుకున్నాడు. 


ఆమె మొబైల్‌కు సందేశాలు రాకపోవడంతో విషయం ఆమెకు తెలియలేదు. ఇదే అదునుగా భావించిన లక్ష్మీనారాయణ ఆమె వద్ద పనిచేయడం మానేసి, చోరీ చేసిన డబ్బులతో బెంగుళూరులో విలాసవంతంగా గడుపుతున్నాడు. ఇండియాకు వచ్చిన ఆమె చెల్లి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమవడం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైం సిబ్బంది, వంట వాడిగా పనిచేసిన లక్ష్మీనారాయణ చోరీ చేసినట్టు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-02-23T13:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising