ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

congress పార్టీ నాయకురాలు అరెస్టు

ABN, First Publish Date - 2021-10-15T14:27:05+05:30

హనీట్రాప్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు విద్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె పలువురు రాజకీయనేతలు, ఐఏఎస్‌, ఐపీఎ్‌సలతోపాటు ప్రభా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: హనీట్రాప్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు విద్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె పలువురు రాజకీయనేతలు, ఐఏఎస్‌, ఐపీఎ్‌సలతోపాటు ప్రభావిత వ్యక్తులకు మోసం చేసి భారీగా నగదు వసూ లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏఐసీసీ సభ్యురాలిగానే కాకుండా తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మేకప్‌ వేసుకుని ఢిల్లీకి చెందిన పలువురిని హనీట్రాప్‌ చేసినట్టు తెలుస్తోంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ అధికారులతోపాటు పలువురు నేతలను పరిచయం చేసుకుని ఆ తర్వాత ఫ్రెండ్‌షిప్‌ కొనసాగించి కొంతకాలం తర్వాత మీ ఫోటోలు ఉన్నాయంటూ బెదరించి వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఓ సివిల్‌ కాంట్రాక్టర్‌ను ఇదే తరహాలో హనీట్రాప్‌కు ప్రయత్నించగా అతను భయపడి అన్నపూర్ణేశ్వరినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యను గురువారం అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా ఈమె సమాజంలో ప్రభావితులను మోసం చేసినట్టు తెలుస్తోందని సమగ్ర విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-10-15T14:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising