ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిన్ని కుమార్తెకు మద్యం తాగించి అఘాయిత్యం..

ABN, First Publish Date - 2021-03-11T15:03:40+05:30

పిన్ని కుమార్తెకు మద్యం తాగించి, లైంగిక దాడి చేశాడో ప్రబుద్ధుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : పిన్ని కుమార్తెకు మద్యం తాగించి, లైంగిక దాడి చేశాడో ప్రబుద్ధుడు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించి డబ్బులు డిమాండ్‌ చేశాడు. కర్ణాటకకు చెందిన దంపతులు ముగ్గురు కుమార్తెలతో నగరంలో నివసిస్తున్నారు. రెండో అమ్మాయి ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె పిన్ని కుమారులు ఇద్దరు ఫిలింనగర్‌లో ఉంటున్నారు. వీరిలో ఒకరు ఈ నెల 1న యువతి వద్ద రూ. 50 వేలు తీసుకున్నాడు. మరొకరు ఆమెకు ఫోన్‌ చేసి ‘నీవు డబ్బులు ఇవ్వడం వల్ల నా సోదరుడు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడ’ని చెప్పాడు. దీంతో 2వ తేదీన ఆమె వారి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో సోదరులు గొడవ పడి వెళ్లిపోయారు. తర్వాత ఆమె వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి మద్యం తాగి వచ్చాడు. 


ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించాడు. మత్తులో నిద్రపోయిన ఆమె మెలకువ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లిపోయింది. 4వ తేదీన తన డబ్బులు ఇవ్వాలని అతడికి ఫోన్‌ చేసింది. ఈ క్రమంలో ఆమె వాట్సా్‌పకు అసభ్యకరమైన ఫొటో పంపిచాడు. ఆందోళనకు గురై ఫోన్‌ చేయగా, లైంగిక దాడి చేసినట్టు చెప్పాడు. ఆ సమయంలోనే వీడియో తీశానని, దానిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. యువతి ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు నిలదీయగా విషయం చెప్పింది. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-03-11T15:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising