ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌ ఎంపీ David Amess దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపిన దుండగుడు!

ABN, First Publish Date - 2021-10-16T17:24:50+05:30

బ్రిటన్​ కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్​ అమెస్‌పై శుక్రవారం కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్​ కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్​ అమెస్‌పై శుక్రవారం కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పు ఇంగ్లాండ్​లోని ఓ చర్చ్​లో నియోజకవర్గం ప్రజలతో అమెస్​ భేటీ అయిన సమయంలోనే ఆయనపై ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు అమెస్‌ను పలుమార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి ఎయిర్​ అంబులెన్స్​ను పంపించారు. హూటాహూటిన అమెస్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన శరీరంపై అనేక కత్తిపోట్లు ఉండటం, అప్పటికే చాలా రక్తం పోవడంతో చనిపోయారు. ఈ ఘటనలో పాతికేళ్ల ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


కాగా, అమీస్‌ హత్యను బ్రిటన్‌ పోలీసులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. 69 ఏళ్ల అమెస్​ 1983 నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఎసెక్స్‌లోని సౌత్‌ఎండ్‌ వెస్ట్‌ నుంచి అమీస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నేత అయిన డేవిడ్ అమీస్‌ ఇలా దారుణ హత్యకు గురికావడం బ్రిటన్ నేతలను షాక్‌కు గురి చేసింది. ఆయన మృతిపై బ్రిటన్​ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక 2016 జూన్​లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. లేబర్​ పార్టీకి చెందిన జో కాక్స్ అనే నేతను ఉత్తర ఇంగ్లాండ్​లోని ఆయన సొంత నియోజకవర్గంలో జరిగిన కత్తిదాడి​లోనే చనిపోయారు. బ్రిటన్​ చట్టసభ్యులకు పార్లమెంట్​లో పూర్తిస్థాయి రక్షణ ఉంటుంది. కానీ నియోజకవర్గాల్లో మాత్రం వారికి ఎటువంటి భద్రత ఉండదని సమాచారం. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అక్కడి రాజకీయ నేతలు వాపోతున్నారు. 

Updated Date - 2021-10-16T17:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising