ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుళ్లో పెళ్లి.. ‘బాత్రూమ్‌కు వెళ్లి వస్తా’ అని చెప్పి వధువు జంప్!

ABN, First Publish Date - 2021-06-07T23:42:58+05:30

అతడో బిజినెస్ మ్యాన్.. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఓ సంబంధం కుదిరింది. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూరత్: అతడో బిజినెస్ మ్యాన్.. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఓ సంబంధం కుదిరింది. కానీ.. పెళ్లి చేసుకున్న రెండు గంటల్లోనే అతడి ఆనందం మొత్తం ఆవిరైపోయింది. బాత్రూమ్‌ వెళ్లి వస్తానంటూ కారు దిగిన పెళ్లి కూతురు అటు నుంచి అటే ఉడాయించింది. కర్ణాటకలోని బిజినెస్ మ్యాన్ అకింత్ జైన్‌కు ఎదురైన అనుభవం ఇది. కొన్నేళ్లుగా పెళ్లి ప్రయత్నాల చేస్తున్న అంకిత్‌కు ఇటీవలే ఓ సంబంధం కుదిరింది. సురత్‌లో ఉండే సతీశ్ పటేల్ అనే మధ్యవర్తి ఈ సంబంధం తెచ్చాడు. పెళ్లి కూతురు స్వాతీ భట్ ఫోటోలు, ఇతర వివరాలను వాట్సాప్ ద్వారా సతీశ్ అంకిత్‌కు పంపించాడు. స్వాతీ తనకు నచ్చడంతో అంకిత్ వెంటనే పెళ్లికి ఒకే చెప్పేశాడు. 


ఈ క్రమంలో పెళ్లి ఖర్చుల కోసం అంకిత్ స్వాతీ భట్ సోదరుడికి రూ. 1.5 లక్షలు ఇచ్చాడు. అంతేకాకుండా మధ్యవర్తికి కిమిషన్ కింద రూ. 20 వేలు చెల్లించాడు. కాబోయే కోడలికి అంకిత్ తల్లి రూ. 20 వేల విలువైన బంగారపు ఉంగరం, వెండి గజ్జెలు, ఓ చీర పెట్టింది.  జూన్ 4ను ముహుర్తం పెట్టుకుని అంకిత్, తల్లితో సహా సూరత్ చేరుకున్నాడు. అక్కడి తాపీ నది సమీపంలోని కపోద్రా ప్రాంతంలోగల ఓ దేవాలయంలో ఎటువంటి హంగూఆర్భాటం లేకుండా వారి వివాహం జరిగింది. 


ఆ తరువాత తన భార్య, తల్లితో కలిసి అంకిత్ బంధువుల ఇంటికి వెళుతుండగా..మార్గమధ్యంలో కారు ఆపమని స్వాతి అతడికి చెప్పింది. ‘‘స్నాక్స్ ఏమైనా తిని.. బాత్రూమ్‌కు వెళ్లి కాస్త ఫ్రెషప్ అయి వస్తా’ అని కారు దిగి వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. వారు ఆ చుట్టుపక్కలంతా వెతికారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత మధ్యవర్తికి ఫోన్ చేస్తే..‘‘మీరు వెతుకుతూ ఉండండి.. ఈలోపు నేను పెళ్లికూతురికి సోదరుడికి ఫోన్ చేస్తాను’’ అని అతడు చెప్పాడు. దీంతో వారు మరికొంత సేపు వెతిక ఆ తరువాత మళ్లీ మధ్యవర్తికి, పెళ్లికూతుకి సోదరుడికి ఫోన్ చేస్తే  వారు లిఫ్ట్ చేయలేదు. దీంతో..తాము మోసపోయామని అర్థం చేసుకున్న వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-06-07T23:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising