ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసద్‌ను హత్య చేసిన నిందితుల పట్టివేత

ABN, First Publish Date - 2021-04-03T16:26:06+05:30

రంగారెడ్డి: మైలార్ దేవుపల్లి వట్టేపల్లిలో మాజీ రౌడీ షీటర్ అసద్ ఖాన్ హత్య కేసును మైలార్ దేవిపల్లి పోలీసులు ఛేదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: మైలార్ దేవుపల్లి వట్టేపల్లిలో మాజీ రౌడీ షీటర్ అసద్ ఖాన్ హత్య కేసును మైలార్ దేవిపల్లి పోలీసులు ఛేదించారు. మిట్ట మద్యాహ్నం అందరూ చూస్తుండగా అసద్ ఖాన్‌ను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనతో... స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆరుగురితో కూడిన ముఠా సభ్యులు బులెట్‌పై వెళుతున్న అసద్ ఖాన్‌ను అడ్డగించి వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆయనపై ప్రత్యర్థులు మెరుపు దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా తలపై పలు మార్లు కత్తులతో దాడి చేశారు. మృతి చెందాడని నిర్దారించుకున్న తర్వాత ఆటోలో పరారయ్యారు. అసద్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో స్పాట్ లోనే మృతి చెందాడు. హత్య జరిగి 12 గంటల లోపే శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు, మైలార్ దేవిపల్లి పోలీసులు హంతకులను పట్టుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు హంతకులు ఒప్పుకున్నారు. 2018 సంవత్సరంలో అంజద్ ఖాన్ హత్యకు ప్రతీకారంగా అసద్ ఖాన్‌ను హత్య చేసినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి మరి కాసేపట్లో హంతకులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.

Updated Date - 2021-04-03T16:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising