ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దా‘రుణ’ యాప్‌కు మరొకరు బలి

ABN, First Publish Date - 2021-01-09T07:52:59+05:30

దా‘రుణ’ యాప్‌కు మరొకరు బలయ్యారు. తీసుకున్న రుణం చెల్లించలేకపోవడంతో పవన్‌కల్యాణ్‌ రెడ్డి (24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో శుక్రవారం ఈ ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుటుంబానికి తెలుస్తుందని ఆత్మహత్య

అప్పు చెల్లించలేక ఉరేసుకున్న యువకుడు


ఇల్లంతకుంట, జనవరి 8: దా‘రుణ’ యాప్‌కు మరొకరు బలయ్యారు. తీసుకున్న రుణం చెల్లించలేకపోవడంతో పవన్‌కల్యాణ్‌ రెడ్డి (24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మల్లుగారి రాజిరెడ్డి, మంగ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన పవన్‌కల్యాణ్‌రెడ్డి హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో స్వగ్రామంలోనే ఉంటున్నాడు. కుటుంబసభ్యులకు తెలియకుండా ఇన్‌స్టంట్‌ లోన్‌యాప్‌ ద్వారా అప్పులు చేశాడు. అప్పు తీర్చాలని యాప్‌ ప్రతినిధులు ఫోన్‌ ద్వారా వేధించడం ప్రారంభించారు. దీంతో తన పెద్దనాన్న కుమార్తె వద్ద రూ.10వేలు తీసుకున్నాడు. మరోసారి డబ్బు కావాలని కోరగా ఆమె సర్దుబాటు చేయలేనని చెప్పింది. సదరు సంస్థ నుంచి తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను పవన్‌కు ఆమె పంపించింది. విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందని భావించి అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తప్పులు చేయవద్దని, ఒక్కోసారి అవి ప్రాణా ల మీదికి వస్తాయని స్నేహితులకు సోషల్‌ మీడియా ద్వారా సూచించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-01-09T07:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising