ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెల్లి పెళ్లికి అప్పు పుట్టలేదని ఉసురు తీసుకున్న యువకుడు

ABN, First Publish Date - 2021-12-08T00:20:02+05:30

చెల్లి పెళ్లికి ఆభరణాలను కొనేందుకు రుణం ఇచ్చేందుకు బ్యాంకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిసూర్ : చెల్లి పెళ్లికి ఆభరణాలను కొనేందుకు రుణం ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు తిరస్కరించడంతో విపిన్ (26) ఆత్మహత్య చేసుకున్నారు. రుణం ఇచ్చేందుకు మొదట హామీ ఇచ్చిన బ్యాంకు అధికారులు చివరి క్షణంలో వెనుకకుపోవడంతో విపిన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆయన తన ప్రైవేటు ఉద్యోగాన్ని కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 


త్రిసూర్‌లోని గాంధీ నగర్‌లో విపిన్ కుటుంబం ఉంటోంది. ఆయన మిత్రులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, విపిన్ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆయన చెల్లికి పెళ్లి కుదిరింది. ఆమె కోసం ఆభరణాల కొనుగోలుకు బ్యాంకు నుంచి రుణం పొందేందుకు ప్రయత్నించారు. మొదట్లో అధికారులు రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ చివరి క్షణంలో తమ హామీ నుంచి వెనుకకు తగ్గారు. దీంతో విపిన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. 


పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, రుణం మంజూరు చేయబోమని బ్యాంకు అదికారులు సోమవారం విపిన్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో విపిన్ తన తల్లిని, చెల్లిని బంగారు ఆభరణాల దుకాణానికి పంపించారు. ‘‘ఆభరణాలను ఎంపిక చేస్తూ ఉండండి, ఈలోగా నేను డబ్బులు తీసుకొస్తాను’’ అని చెప్పి, వారిని పంపించారని తెలిపారు. అనంతరం ఆయన తన ఇంటికి వెళ్లి, ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారని చెప్పారు. 


Updated Date - 2021-12-08T00:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising