ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సీరియల్ కిల్లర్‌ని నేనే.. సూసైడ్ నోట్‌లో వెల్లడించిన పోలీస్ అధికారి

ABN, First Publish Date - 2021-10-03T22:51:27+05:30

ఫ్రాన్స్‌కు చెందిన ఓ పోలీసు అధికారి తన సూసైడ్‌ నోట్‌లో వెల్లడించిన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫారిస్: ఫ్రాన్స్‌కు చెందిన ఓ పోలీసు అధికారి తన సూసైడ్‌ నోట్‌లో వెల్లడించిన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి.1980 నాటి సీరియల్ కిల్లర్‌ను తానేనని అందులో పేర్కొనడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 1980-1990లో నలుగురిని హత్య చేసిన ‘లె గ్రెల్’ సీరియల్ కిల్లర్‌ను తానేనని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఫ్రెంచ్ మీడియా అతడిని 59 ఏళ్ల ఫ్రాంకోయిస్ వి గా గుర్తించింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని గ్రౌడు-రోయిలో ఉన్న కోస్టల్ రిసార్ట్‌లో అతడు విగతజీవిగా కనిపించాడు. 


సీరియల్ కిల్లర్‌కు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఫ్రెంచ్ పోలీసులు గత నెల 24న అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే, సెప్టెంబరు 27 నుంచి ఫ్రాంకోయిస్ కనిపించడం లేదని అతడి భార్య వారికి చెప్పడంతో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ రిసార్టులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఆ పక్కనే ఉన్న ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు, గతంలో సీరియల్ కిల్లర్ హత్యలకు పాల్పడిన ప్రదేశం నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు సరిపోలడంతో ఆ హంతకుడు ఫ్రాంకోయిసేనని పోలీసులు నిర్ధారించారు. 1983-1994 మధ్య హంతకుడు చాలా చురుగ్గా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఫ్రాంకోయిస్ వి 1998లో పోలీసు అధికారిగా రిటైరయ్యాడు. అతడి చేతిలో హత్యకు గురైన వారిలో సెసిల్ బ్లోచ్ అనే 11 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. 1986లో ఆ చిన్నారి హత్యకు గురైంది. అంతేకాదు, అతడు ఆరుగురిపై అత్యాచారాలకు కూడా పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.  


Updated Date - 2021-10-03T22:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising