ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంజారాహిల్స్‌‌లో ఏడుగురు ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-04-20T12:49:28+05:30

ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులను అడ్డుకొని డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌ పరిధిలోని అడ్డగుట్టకు చెందిన మహ్మద్‌ రహీం డ్రైవర్‌. ఈ నెల 18న జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఇందిరానగర్‌ వైపు ఆటోలో వెళ్తుండగా కొందరు ట్రాన్స్‌జెండర్లు అడ్డుకున్నారు. అతడి ప్రమేయం లేకుండా జేబులో నుంచి వెయ్యి రూపాయలు లాక్కున్నారు. డబ్బు తిరిగి ఇచ్చేయాలని రహీం కోరగా దుర్భాషలాడారు. దీంతో రహీం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


గతంలో ఇలాంటివి అనేక ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రహీం వద్ద డబ్బులు లాక్కున  ఇందిరానగర్‌కు చెందిన సీహెచ్‌ నిత్య, ఎస్‌.స్వీటి అలియాస్‌ నరేంద్ర, బి.శైలు, ఎస్‌.ఫాతీమా, ఎం.ప్రియ, ఎండీ సిమ్రాన్‌ ఫాతిమా, దీక్ష అలియాస్‌ లడ్డును అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 341,384,504,506 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుమని సీఐ శివచంద్ర తెలిపారు.

Updated Date - 2021-04-20T12:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising