ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్సిల్‌ క్యాన్సిల్‌ అంటూ మోసం.. 2.38లక్షలు మాయం

ABN, First Publish Date - 2021-05-04T12:33:44+05:30

కొరియర్‌ పార్సిల్‌ కోసం నెట్‌లో దొరికిన నెంబర్‌కు కాల్‌చేస్తే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : కొరియర్‌ పార్సిల్‌ కోసం నెట్‌లో దొరికిన నెంబర్‌కు కాల్‌చేస్తే బాధితుని ఖాతాలోంచి రూ.2.38లక్షలు మాయమయ్యాయి. కిషన్‌బాగ్‌, నందిముస్లాయిగూడ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌కు కొరియర్‌ సంస్థ ద్వారా పార్సిల్‌ రావాల్సి ఉంది. సకాలంలో రాలేదని భావించిన రాజ్‌కుమార్‌ ఆన్‌లైన్‌లో వెతికితే ఓ నెంబర్‌ కనిపించింది. ఆ నంబర్‌కు కాల్‌ చేశాడు. రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి సంబంధిత వ్యక్తి మాట్లాడినట్లు నటించి, కనుక్కొని చెబుతానని ఫోన్‌ పెట్టేశాడు. కాసేపటి తర్వాత మళ్లీ కాల్‌ చేసి ఆ పార్సిల్‌ క్యాన్సిల్‌ అయిందని చెప్పాడు. మరి తన డబ్బు ఎలా అని బాధితుడు ప్రశ్నించగా, ఎనీడెస్క్‌ యాప్‌ ద్వారా ఆ డబ్బులు తిరిగి ఖాతాలోకి వచ్చేలా చేస్తానని నమ్మించాడు. నమ్మిన బాధితుడు అతనికి ఎనీడెస్క్‌ యాప్‌ కంట్రోల్‌ ఇచ్చేశాడు. నిందితుడు యూనో అనే యాప్‌ ద్వారా అతని ఆన్‌లైన్‌ ఖాతా వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయమన్నాడు. ఎనీడెస్క్‌ యాప్‌తో పూర్తి కంట్రోల్‌ తీసుకుని క్షణాల్లో బాధితుని ఖాతాలోంచి రూ.2.38లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహంచిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-05-04T12:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising