ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాకితో బర్త్‌డే కేక్ కటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ABN, First Publish Date - 2021-01-16T00:17:13+05:30

స్నేహితుల కేరింతల మధ్య ఓ యువకుడు బర్త్ డే కేకును తుపాకితో కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: స్నేహితుల కేరింతల మధ్య ఓ యువకుడు బర్త్ డే కేక్‌ను తుపాకితో కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసుల దృష్టికి చేరడంతో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. 20 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఓ యువకుడు పిస్టల్‌తో కేక్‌ను కట్  చేస్తుండగా, స్నేహితులు చప్పట్లతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాటు తుపాకిని పట్టుకున్న యువకుడు కేక్‌ను కట్ చేస్తున్న సమయంలో మరో వ్యక్తి అతడి చేయి పట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. 


వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన హర్పూర్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. వారి నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. బర్త్ డే జరుపుకున్న షానవాజ్‌తోపాటు అతడి స్నేహితుడు షకీబ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.  



Updated Date - 2021-01-16T00:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising