ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికను గర్భవతిని చేసిన ప్రియుడు.. పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో..

ABN, First Publish Date - 2021-03-07T22:14:58+05:30

గర్భంతో ఉన్న 17 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసి, ఆపై పూడ్చిపెట్టిన కేసులో ఇద్దరు యువకులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేదినినగర్ (ఝార్ఖండ్): గర్భంతో ఉన్న 17 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసి, ఆపై పూడ్చిపెట్టిన కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్‌లోని పాలేము జిల్లాలో జరిగిందీ ఘటన. బాధితురాలి 18 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితుడిని హుస్సేన్‌బాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కొరియాడి గ్రామంలో శనివారం అరెస్ట్ చేశారు.  ఎస్పీ సంజీవ్ కుమార్ కథనం ప్రకారం.. ప్రియుడి కారణంగా బాలిక గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువకుడు అబార్షన్ చేయించాలని నిర్ణయించాడు. అబార్షన్ కోసం ఓ నర్స్ రూ. 10 వేలు అడిగితే సర్దుబాటు చేయలేకపోయాడు. దీంతో ఆమెను చంపడమే సమస్యకు పరిష్కారమని భావించాడు.  గత నెల 21న బాలికను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో మెడపై పొడిచి చంపేశాడు. అనంతరం స్నేహితుడితో కలిసి ఆమె మృతదేహాన్ని సోనే నది ఒడ్డుకు తీసుకెళ్లి పాతిపెట్టాడు. ఈ కేసులో నిన్న నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్టు చెప్పారు.

Updated Date - 2021-03-07T22:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising