ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్లీల సంభాషణకు 1,600 సిమ్‌కార్డులు

ABN, First Publish Date - 2021-01-07T17:53:46+05:30

1,600 సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : లోన్‌ యాప్‌ ద్వారా పలు కోట్లు కందు వడ్డీ వసూలుచేసి ప్రజలను వేధింపులకు గురిచేసిన చైనా దేశపు ముఠా అశ్లీల సంభాషణలు, బెదిరింపులకు నకిలీ దస్తావేజులతో 1,600 సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. చైనాకు చెందిన జియాఎమో (38), ఊయాన్‌లున్‌ (28), బెంగుళూరుకు చెందిన ప్రమోద (28), పవన్‌ (27) అనే వారి సహాయంతో వెంటనే లోన్‌ అందజేసే 50కి పైగా యాప్‌లు నడిపారు. వీటి ద్వారా కందు వడ్డీ వసూలుచేశారు. రుణాలు తిరిగి చెల్లించని వారిని మొబైల్‌ ఫోన్‌లో సంప్రదించి ఆశ్లీల పదజాలంతో బెదిరించేందుకు 110 మంది ఉద్యోగులతో నకిలీ కాల్‌ సెంటర్లు నడిపారు. వారిని ఈ నెల 2వ తేది చెన్నై కేంద్ర క్రైం విభాగం పోలీసులు అరెస్ట్‌ చేసి పుళల్‌ జైలుకు తరలించారు.


పోలీసుల విచారణలో, వీరికి చైనాకు చెందిన హాంగ్‌ అనే వ్యక్తి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది. హాంగ్‌ ప్రత్యేక యాప్‌ ద్వారా తన కింద పనిచేసే వారిని పర్యవేక్షిస్తు వచ్చాడు. ఇతని ఆధ్వర్యంలో చైనాకు చెందిన ఛీటింగ్‌ ముఠా పనిచేస్తుండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా బెంగుళూరు, చెన్నైలో కార్పొరేట్‌ ఉద్యోగుల పేరుతో నకిలీ ఆధారాలు అందజేసి 1,600 సిమ్‌ కార్డ్‌లు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. ఈ సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసేందుకు సహాయపడిన సమాచార శాఖ ఉద్యోగులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సమాయాత్తమవుతున్నారు.

Updated Date - 2021-01-07T17:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising