ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా ఐదుగురి అత్యాచారం

ABN, First Publish Date - 2021-04-13T23:05:57+05:30

తమిళనాడులోని కడలూరులో ఆరు నెలలుగా ఓ బాలికపై జరుగుతున్న దారుణం తాజాగా వెలుగులోకి వచ్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులోని కడలూరులో ఆరు నెలలుగా ఓ బాలికపై జరుగుతున్న దారుణం తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. 15 ఏళ్ల బాలికను బెదిరించిన ఐదుగురు యువకులు ఆరు నెలులగా ఆమెపై అత్యచారానికి పాల్పడుతున్నారు. తాజాగా నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు 19 నుంచి 21 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక తన బాబాయి ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని ఎన్.ధీన (21), ఎస్.విగ్నేష్ (19), వి.హోనెస్ట్ రాజ్ (21)గా గుర్తించారు. 


బాలిక ఆరోగ్యం క్షీణించడంతో యువకులు చేస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక దిగాలుగా ఉండడం, అనారోగ్యం పాలు కావడంతో ఏం జరిగిందని బాబాయి ప్రశ్నించగా బాలిక చెప్పింది విని హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రి చెన్నైలో పనిచేస్తుండగా, బాధితురాలు కడలూరులోని తన బాబాయి ఇంటి వద్ద ఉంటోంది. నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న రంజిత్, రంగా కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-04-13T23:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising