ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ఉత్పత్తులపై సెస్ ఉంటుందా ?

ABN, First Publish Date - 2021-01-19T22:14:19+05:30

ఏడాది కాలంగా ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గిన నేపధ్యంలో... రాబడి పెంచుకునే అంశాల వేపు దృష్టి సారించిన కేంద్రం... పెట్రోలియం ఉత్పత్తులపై, సంపన్నులపై సెస్ విధించవచ్చని వినిపిస్తోంది. అంతేకాదు... ఇతర ఉత్పత్తులు కూడా భారమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఏడాది కాలంగా ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గిన నేపధ్యంలో... రాబడి పెంచుకునే అంశాల వేపు దృష్టి సారించిన కేంద్రం... పెట్రోలియం ఉత్పత్తులపై, సంపన్నులపై సెస్ విధించవచ్చని వినిపిస్తోంది. అంతేకాదు... ఇతర ఉత్పత్తులు కూడా భారమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కాగా... దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఈ భారం పెరిగే అవకాశముందని చెబుతున్నారు. 


ఇక... దిగుమతి చేసుకునే 50 కి పైగా ఉత్పత్తులపై సుంకాలను 5-10 శాతం వరకు పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర ఉపకరణాలు ఉన్నాయి. అయితే దిగుమతి చేసుకునే ఉత్పత్తుల పైనే ఈ భారం పడే అవకాశముంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రధాని మోడీ దిగుమతి సుంకాలు పెంచాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 


స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ విడిభాగాలు భారం మేడిన్ ఇండియా ఉత్పత్తులు పెరగాలంటే విదేశీ దిగుమతుల భారం తగ్గాలని, అప్పుడే దేశంలో ఉత్పత్తి పెరుగుతుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే... దిగుమతి ఉత్పత్తులపై వచ్చే బడ్జెట్‌లో భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 




Updated Date - 2021-01-19T22:14:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising