ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సాప్ ‘లాస్ట్ సీన్’‌ను ఇక మీరు హైడ్ చేసుకోవచ్చు!

ABN, First Publish Date - 2021-09-07T22:59:38+05:30

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. సాధారణంగా ఇప్పటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. సాధారణంగా ఇప్పటి వరకు ఎవరైనా మనకు వాట్సాప్ మెసేజ్ చేయాలని మన కాంటాక్ట్ ఓపెన్ చేసినప్పుడు.. మనం చివరిసారి వాట్సాప్‌ను ఎప్పుడు చూసిందీ (లాస్ట్ సీన్) పైన కనిపిస్తుంది.


అయితే, ఇకపై ఇలా మనం చివరిసారి ఎప్పుడు వాట్సాప్‌ను ఉపయోగించామో యూజర్లకు తెలియకుండా ఉండేందుకు ఈ ఆప్షన్‌ను హైడ్ చేసుకునేలా ఓ సరికొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. దీంతోపాటు స్టేటస్, ప్రొఫైల్‌ పిక్చర్‌ను కూడా హైడ్ చేసుకోవచ్చు. ఎంపిక చేసిన కాంటాక్ట్‌లకు కూడా అవి కనిపించకుండా చేసుకోవచ్చు.


అయితే, ప్రస్తుతం ఎంచుకోవడానికి మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ లాస్ట్ సీన్, ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్‌ను చూసేందుకు అనుమతించడం, లేదంటే కొన్ని కాంటాక్ట్‌లకు మాత్రమే పరిమితం చేసుకోవడం వంటి ఆప్షన్ల నుంచి మనకు అవసరమైన దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది నిర్దిష్ట వ్యక్తుల నుంచి మాత్రం పైన పేర్కొన్న ఫీచర్లను దాచిపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది.


ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ తన గోప్యతా సెట్టింగ్‌లో మార్పులు చేస్తోంది. వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్‌లు, ఫొటోలను ఎవరి నుంచి దాచాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి మాత్రం అనుమతించదు. ప్రస్తుతం దీనిని ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన్లలో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ తీసుకొచ్చే అవకాశం ఉంది. 

Updated Date - 2021-09-07T22:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising