ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెబ్బకు దిగొచ్చిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ అమలు వాయిదా!

ABN, First Publish Date - 2021-01-16T22:49:42+05:30

వివాదాస్పద ప్రైవసీ పాలసీపై మెసేజింగ్ యాప్ వాట్సాప్ దిగొచ్చింది. ఈ కొత్త విధానాన్ని మూడు నెలలపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వివాదాస్పద ప్రైవసీ పాలసీపై మెసేజింగ్ యాప్ వాట్సాప్ దిగొచ్చింది. ఈ కొత్త విధానాన్ని మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 8 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉండగా, నిర్ణయాన్ని మూడు నెలలు పొడిగించింది. అప్పటి వరకు ఎవరి ఖాతాలను డిలీట్ చేయబోమని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ గత వారం తన కొత్త ప్రైవసీని పాలసీని ప్రకటించింది. దీనిని అంగీకరించిన వారి ఖాతాలు మాత్రమే కొనసాగుతాయని, లేకుంటే డిలీట్ అవుతాయంటూ వినియోగదారులకు పాప్ అప్ మెసేజ్‌లు పంపింది. కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం.. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని పేర్కొంది. 


దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పంచుకుంటారని వినియోగదారులు నిలదీశారు. చాలామంది వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేసి ప్రత్యామ్నాయ యాప్స్‌ అయిన సిగ్నల్, టెలిగ్రామ్ వైపు మళ్లారు. దీంతో వాటి డౌన్‌లోడ్లు పోటెత్తాయి.


జరగబోయే నష్టాన్ని ఊహించిన వాట్సాప్.. అందరివీ కాదని, బిజినెస్ ఖాతాల సమాచారాన్ని మాత్రమే పంచుకుంటామని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు తగ్గలేదు. దీంతో ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్.. నిర్ణయాన్ని మూడు నెలలపాటు వాయిదా వేసింది. తాజా అప్‌డేట్‌పై ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లిందని, ఈ మూడు నెలల్లో కొత్త విధానంపై వినియోగదారులకు అర్థమయ్యేలా చెబుతామని వివరించింది.  

Updated Date - 2021-01-16T22:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising