ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు ఇలా..

ABN, First Publish Date - 2021-04-03T02:39:30+05:30

చైనీస్ మొబైల్ మేకర్ వివో ఆ దేశంలో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ వివో ఆ దేశంలో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ‘ఎక్స్ 60’ సిరీస్‌లో తాజాగా ‘వివో ఎక్స్60టి’ని తీసుకొచ్చింది. వివో ఎక్స్ 60, వివో ఎక్స్ 60 ప్రొ, వివో ఎక్స్ 60 ప్రొ ప్లస్ ఫోన్లను గత నెలలో విడుదల చేయగా, తాజాగా వివోఎక్స్ 60టిని విడుదల చేసింది. ఇందులో ఒకే ఒక్క వేరియంట్‌ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ మోడల్‌ను తీసుకురాగా, దీని ధర చైనాలో 3,498 యెన్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39 వేలు). షిమ్మర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. 


వివో ఎక్స్ 60టి స్పెసిఫికేషన్లు:  ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్‌వేర్, డ్యూయల్ సిమ్ (నానో) 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ఆక్టాకోర్ ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ. 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, సెల్ఫీల కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా, 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. 

Updated Date - 2021-04-03T02:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising