ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాక ఇండస్ట్రీస్‌ లాభంలో 18% వృద్ధి

ABN, First Publish Date - 2021-07-27T05:53:40+05:30

సిమెంట్‌ రూఫింగ్‌ షీట్లకు పెరుగుతున్న గిరాకీ అనుగుణంగా విశాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సిమెంట్‌ రూఫింగ్‌ షీట్లకు పెరుగుతున్న గిరాకీ అనుగుణంగా విశాక ఇండస్ట్రీస్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. రాయ్‌బరేలీ యూనిట్‌లో లక్ష టన్నుల సామర్థ్యంతో కొత్త తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విశాక ఇండస్ట్రీస్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీ వంశీ కృష్ణ తెలిపారు. దీంతో మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 9.02 లక్షల టన్నులకు చేరుతుంది.


కోయంబత్తూర్‌ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫైబర్‌ సిమెంట్‌ బోర్డుల తయారీ యూనిట్‌ డిసెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభించనుందని తెలిపారు. కాగా స్టాండ్‌ ఎలోన్‌ ప్రాతిపదికన ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి కంపెనీ నికర అమ్మకాలు 22 శాతం పెరిగి రూ.287 కోట్ల నుంచి రూ.351 కోట్లకు చేరాయి. నికర లాభం కూడా 18 శాతం వృద్ధితో రూ.34.42 కోట్ల నుంచి రూ.40.58 కోట్లకు పెరిగింది. 

Updated Date - 2021-07-27T05:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising