ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనానికీ నామినీ!

ABN, First Publish Date - 2021-05-16T06:49:10+05:30

మరణించిన వ్యక్తి పేరు మీదున్న కారు లేదా బైక్‌ను విక్రయించడం క్లిష్టమైన ప్రక్రియ. దివంగత వ్యక్తి వారసుడు లేదా వారసురాలు వాహన యాజమాన్య హక్కులను తన పేరిట బదలాయించుకునేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హక్కుల బదిలీ ఇక సులువు 


మరణించిన వ్యక్తి పేరు మీదున్న కారు లేదా బైక్‌ను విక్రయించడం క్లిష్టమైన ప్రక్రియ. దివంగత వ్యక్తి వారసుడు లేదా వారసురాలు వాహన యాజమాన్య హక్కులను తన పేరిట బదలాయించుకునేందుకు పలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అంతేకాదు,  ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీఓ)ను బట్టి నిబంధనలూ మారతాయి. చనిపోయిన వ్యక్తి, వారసులు భిన్న ఆర్‌టీఓ పరిధులకు చెందినవారైతే, వాహన యాజమాన్య హక్కుల బదిలీ పెద్ద సవాలే. 

జాతీయ మోటార్‌ వాహన చట్టం-1989 సవరణలతో ఈ ఇబ్బందులకు త్వరలోనే తెరపడనుంది. ఇకపై వాహన యజమాని రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌లో నామినీ పేరును చేర్చే అవకాశం కల్పించనున్నారు. అంతేకాదు, మధ్యలో నామినీని మార్చే సౌలభ్యమూ ఉంటుంది.  దురదృష్టవశాత్తూ వాహన యజమాని చనిపోయిన పక్షంలో నామినీ తన పేరిట యాజమాన్య హక్కులను సులభంగా బదిలీ చేసుకోవచ్చు. 


హక్కుల బదిలీ ఎలా..? 

  1. వాహన యజమాని మరణించిన విషయాన్ని నామినీ 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌ అధికారికి తెలపాలి. తద్వారా నామినీ ఆ వాహనాన్ని మూడు నెలల వరకు యజమాని హోదాలో ఉపయోగించుకునే వీలుంటుంది. 
  2. ఆ మూడు నెలల్లోగా నామినీ వాహన హక్కులను తన పేరిట బదలాయించుకునేందుకు ఫామ్‌-31ను సమర్పిస్తే సరిపోతుంది. 
  3. రుణంపై వాహనాన్ని కొనుగోలు చేసిన పక్షంలో, యాజమాన్య హక్కుల బదిలీకి ముందే ఆ వాహన రుణ బకాయిని చెల్లించాల్సి ఉంటుంది. రుణదాత నిరభ్యంతర పత్రం సమర్పించాకే హక్కుల బదిలీ జరుగుతుంది. 

Updated Date - 2021-05-16T06:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising