ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా జీడీపీ డౌన్...

ABN, First Publish Date - 2021-10-19T21:28:47+05:30

సెప్టెంబరు త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు క్షీణించినప్పటికీ, నిరుద్యోగం కాస్త తగ్గుముఖం పట్టింది. గత ఏడాది కాలంలో పట్టణ ప్రాంతాల్లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు సెప్టెంబరు త్రైమాసికంలో 4.9 శాతానికి తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : సెప్టెంబరు త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు క్షీణించినప్పటికీ, నిరుద్యోగం కాస్త తగ్గుముఖం పట్టింది. గత ఏడాది కాలంలో పట్టణ ప్రాంతాల్లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు సెప్టెంబరు  త్రైమాసికంలో 4.9 శాతానికి తగ్గింది. గత తొమ్మిది నెలల్లో పట్టణ ప్రాంతాల్లో 104.5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు చైనా ప్రకటించింది. ప్రస్తుత కేలెండర్ సంవత్సరం మూడో త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు దారుణంగా క్షీణించింది. రెండో త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి నమోదు చేసిన డ్రాగన్ కంట్రీ... మూడో త్రైమాసికంలో 4.9 శాతానికి పడిపోయింది.


జనవరి-మార్చి తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 18.3 శాతంగా నమోదు చేసిన విషయం తెలిసిందే. గత మూడు త్రైమాసికాల జీడీపీలో 64.8 శాతం వాటా వినియోగానిదేనని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. కరోనా సంక్షోభం తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగం పెరగడంతో ఉత్పత్తి పెరిగింది. ఈ క్రమంలో...  ముడిసరుకుకు డిమాండ్ పెరిగి, ధరలు కూడా పెరిగాయి. దీంతో పాటు ఎవర్ గ్రాండ్ రియాల్టీలో నెలకొన్న సంక్షోభం, బొగ్గు కొరత కారణంగా విద్యుత్తు సంక్షోభం తలెత్తింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావం చూపింది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగుచూడటం కూడా వృద్ధిరేటు మందగించడానికి కారణమైంది.


నాలుగో త్రైమాసికంలో ఒత్తిడి...

చైనాలో కన్స్యూమర్ గూడ్స్ రిటైల్ సేల్స్16.4 శాతం పెరిగి, 4.9 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. తొలి మూడు త్రైమాసికాల్లో ‘విలువ’ ఆధారిత పారిశ్రామిక ఉత్పత్తి 11.8 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో పెట్టుబడులు 7.3 శాతం పెరిగాయి. సెప్టెంబరు నెలలో పట్టణ ప్రాంత నిరుద్యోగం 4.9 శాతం నమోదైంది. గతే ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 0.5 శాతం క్షీణత నమోదైంది.


Updated Date - 2021-10-19T21:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising