ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో ఆదాయాలు, కొలువులు గాయబ్‌

ABN, First Publish Date - 2021-06-01T05:56:12+05:30

కొవిడ్‌ రెండో ఉధృతి ఉద్యోగాల్ని మింగేస్తోంది. గత నెల రోజుల్లోనే దాదాపు కోటి మంది రోడ్డున పడ్డారు. కొవిడ్‌ ప్రారంభమైన గత ఏడాది నుంచి చూస్తే దేశంలో 97 శాతం కుటుంబాల ఆదాయాలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కొవిడ్‌ రెండో ఉధృతి ఉద్యోగాల్ని మింగేస్తోంది. గత నెల రోజుల్లోనే దాదాపు కోటి మంది రోడ్డున పడ్డారు. కొవిడ్‌ ప్రారంభమైన గత ఏడాది నుంచి చూస్తే దేశంలో 97 శాతం కుటుంబాల ఆదాయాలకు గండి పడింది. భారత ఆర్థిక  వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశీలించే సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) సీఈఓ మహేశ్‌ వ్యాస్‌ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 8 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మే నెలలో 12 శాతానికి చేరనుందని తెలిపారు. కొవిడ్‌ రెండో ఉధృతే ఈ దుస్థితికి కారణమన్నారు. కొవిడ్‌  సమస్య ఇప్పటికిప్పుడు సద్దుమణిగినా నిరుద్యోగ సమస్య పాక్షికంగానే తప్ప, పూర్తి స్థాయిలో  పరిష్కారమయ్యే అవకాశం లేదని వ్యాస్‌ స్పష్టం చేశారు. ముఖ్యంగా సంఘటిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులకు మళ్లీ ఉద్యోగాలు సంపాదించేందుకు ఎంత లేదన్నా కనీసం ఏడాది పట్టొచ్చన్నారు. కుటుంబ ఆదాయాలపై కొవిడ్‌ ప్రభావాన్నీ ఈ ఏడాది 1.75 లక్షల కుటుంబాలను సీఎంఐఈ సర్వే చేసింది. ఈ సర్వేలో కేవలం మూడు శాతం కుటుంబాలు మాత్రమే గత ఏడాది కాలంలో తమ ఆదాయాలు పెరిగినట్టు చెప్పారు. 55 శాతం మంది ఆదాయాలు పడిపోయినట్టు తెలిపారు. 42 శాతం మంది మాత్రం స్థిరంగా ఉన్నట్టు చెప్పారు. 


Updated Date - 2021-06-01T05:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising