ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమిక్రాన్ ఎఫెక్ట్... కనిష్టానికి సూచీలు...

ABN, First Publish Date - 2021-12-06T22:09:02+05:30

దేశీయ మార్కెట్లు వరుసగా రెండోరోజు(సోమవారం) కూడా నష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్‌... డ్రాగ్‌ చేయడంతో నిఫ్టీ పదిహేడు వేల దిగువకు పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : దేశీయ మార్కెట్లు వరుసగా రెండోరోజు(సోమవారం)  కూడా  నష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్‌... డ్రాగ్‌ చేయడంతో నిఫ్టీ పదిహేడు వేల దిగువకు పడిపోయింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో... దేశీయ సూచీలు మూడు నెలల కనిష్ట స్థాయి వద్ద ముగిసాయి. ఉదయం సెషన్‌లో లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీలు... ట్రేడింగ్‌ ఏ దశలో కూడా లాభాల బాటలోకి వెళ్ళలేకపోయాయి.


ప్రత్యేకించి... మిడ్‌సెషన్‌ తర్వాత మార్కెట్‌లో... అమ్మకాల ఒత్తిడి ఒక్కసారిగా  పెరిగిపోయింది. ట్రేడింగ్‌ మొత్తం మీద సెన్సెక్స్‌ 949 పాయింట్ల నష్టంతో 56747 వద్ద, నిఫ్టీ 284 పాయింట్ల నష్టంతో 16912 వద్ద ఈ రోజు ట్రేడింగ్‌ను ముగించాయి. ఇక... బ్యాంక్‌ నిఫ్టీ 461 పాయింట్లను కోల్పోయి 35736 వద్ద స్థిరపడింది. హెవీ వెయిట్‌ స్టాక్స్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు ఈ రోజు నష్టాలను లీడ్‌ చేయడం గమనార్హం. బోర్డర్‌ ఇండిసెస్‌ విషయానికొస్తే... మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.


మొత్తం షేర్లలో 1340 స్టాక్స్‌ లాభాలను నమోదు చేయగా, 1948 స్టాక్స్‌ నష్టాలను చవిచూశాయి. ఇక... 165 స్టాక్స్‌ విలువలో మాత్తరం ఎలాంటి మార్పూ లేదు. నిఫ్టీలో యూపీఎల్‌ మినహా అన్ని కంపెనీలు కూడా నష్టాలను చవిచూశాయి. కోల్‌ఇండియా, ఇండస్ ఇండ్‌ బ్యాంక్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లు నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. కోల్‌ ఇండియా... ఏడా శాతానికి పైగా నష్టపోయి రూ. 148.55 వద్ద ముగిసింది. 

Updated Date - 2021-12-06T22:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising