స్లైడింగ్ లోనే ట్రేడింగ్...
ABN, First Publish Date - 2021-10-30T04:37:21+05:30
శుక్రవారం నాటి ట్రేడింగ్ స్లైడింగ్‌లోనే ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ రోజు కూడా బేజారెత్తిపోయాయి.
ముంబై : శుక్రవారం నాటి ట్రేడింగ్ స్లైడింగ్‌లోనే ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ రోజు కూడా బేజారెత్తిపోయాయి. మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్ హై వాల్యుయేషన్స్‌లో కొనసాగుతుండడంతో, పలు విదేశీ బ్రోకరేజ్‌లు భారతదేశ ఈక్విటీ రేటింగ్‌లో కోతలు విధించాయి. ఈ క్రమంలో... విదేశీ పెట్టుబడిదారులు గత ఆరు సెషన్లుగా నెట్ సెల్లర్స్‌గానే ఉన్నారు. మార్కెట్‌లో కఠినమైన అమ్మకాలకు ఇదో కారణమైంది. ఎంఓఎం ప్రాతిపదికన, సెప్టెంబరులో జపానీస్ ఫ్యాక్టరీ ఔట్‌పుట్ 5.4 శాతం పడిపోవడంతో ఆసియా మార్కెట్ల సంకేతాలు బలహీనంగా మారాయి.
Updated Date - 2021-10-30T04:37:21+05:30 IST