ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Bengal : 3వేల పెట్రోల్ పంపుల బంద్

ABN, First Publish Date - 2021-08-31T13:20:36+05:30

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని 3వేల పెట్రోల్ బంకులు మంగళవారం మూతపడ్డాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిమాండ్ల సాధనకు ఒకరోజు సమ్మె

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని 3వేల పెట్రోల్ బంకులు మంగళవారం మూతపడ్డాయి.తమ దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చింది. 24 గంటల పెట్రోల్ బంకుల సమ్మె మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.‘‘ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అత్యంత హైగ్రోస్కోపిక్. వర్షాకాలంలో ఇది పెట్రోల్ పంపుల భూగర్భ ట్యాంకుల్లోకి వర్షపు నీరు వెళుతోంది. ఇది పెట్రో డీలర్లు, వినియోగదారులకు మధ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది మాకు,  కొనుగోలుదారులకు మధ్య అపనమ్మకాన్ని కలిగిస్తుంది’’ అని పెట్రోల్ పంపుల యజమానుల సంఘం జాయింట్ సెక్రటరీ ప్రసేంజిత్ సేన్ చెప్పారు.


చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పై వినియోగదారులకు అవగాహన కల్పించాలని, వర్షాకాలంలో ఇథనాల్-మిశ్రమ పెట్రోల్ సరఫరాను పరిమితం చేయాలని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్నేహశిష్ భౌమిక్ డిమాండ్ చేశారు. పెట్రోల్ పంపులకు ఇంధనం తక్కువగా సరఫరా చేయడం అనేది చాలా కాలంగా ఉన్న సమస్య అని దీన్ని పరిష్కరించాలని పెట్రోల్ పంపుల యజమానులు కోరుతున్నారు. ఇంధనం రవాణ సమయంలో చోరీకి గురవుతోందని, దీనివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని పెట్రోల్ పంపుల యజమానులు అంటున్నారు.పెట్రోల్ పంపుల ఒకరోజు సమ్మెతో పలు వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.

Updated Date - 2021-08-31T13:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising