ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈవీ సెక్టారులోకి... లేట్ అయినా... లేటెస్ట్‌గా...

ABN, First Publish Date - 2021-11-19T06:28:47+05:30

విద్యుత్తు వాహనాల(ఈవీ) విభాగంలోకి ప్రవేశించడం కాస్త ఆలస్యమైనప్పటికీ... లేటెస్ట్‌గానే ఎంట్రీ ఇస్తోంది అశోక్ లేలాండ్. యూరప్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, జపాన్‌ తదితర దేశాలకు వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఎండ్-టు-ఎండ్ జీరో-కార్బన్ మొబిలిటీతో రోడ్డెక్కడానికి రావడానికి అశోక్ లేలాండ్ సిద్ధమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : విద్యుత్తు వాహనాల(ఈవీ)  విభాగంలోకి ప్రవేశించడం కాస్త ఆలస్యమైనప్పటికీ... లేటెస్ట్‌గానే ఎంట్రీ ఇస్తోంది అశోక్ లేలాండ్. యూరప్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, జపాన్‌ తదితర దేశాలకు వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఎండ్-టు-ఎండ్ జీరో-కార్బన్ మొబిలిటీతో రోడ్డెక్కడానికి రావడానికి అశోక్ లేలాండ్ సిద్ధమవుతోంది. 


ఈవీ సెగ్మెంట్‌లో అశోక్ లేలాండ్ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి హిందూజా కుటుంబంలో మూడో తరానికి చెందిన ధీరజ్ హిందూజా, షోమ్ అశోక్ హిందూజా కలిసి అడుగులు వేస్తున్నారు. గోపీచంద్ హిందూజా(అశోక్ హిందుజా సోదరుడు) కుమారుడు ధీరజ్ నేతృత్వంలోని కంపెనీ బోర్డులోకి అశోక్ హిందూజా(నలుగురు సోదరుల్లో చిన్నవాడు) కుమారుడు షోమ్ చేరాడు.  గ్రూప్ రెన్యువల్‌ బిజినెస్‌కు కూడా షోమ్‌ ఇన్‌ఛార్జ్‌. హిందూజా రెన్యూవబుల్స్‌లో చేరడం ద్వారా, అశోక్ లేలాండ్ ఈవీలకు దీర్ఘకాలంలో సౌర విద్యుత్తుకు ఢోకా ఉండబోదని చెబుతున్నారు. తద్వారా ఎండ్-టు-ఎండ్ జీరో-కార్బన్ మొబిలిటీ ప్రొవైడర్‌గా మారుతుందని భావిస్తున్నారు. ఈ కంపెనీ, బ్రిటిష్ బస్‌ మేకర్‌ ఆప్టేర్ పీఐసీను కొనుగోలు చేయడం ద్వారా ఈవీ స్పేస్‌పై తన ఆసక్తిని ప్రపంచానికి వెల్లడించింది.


భారత్‌లో ఇప్పటికే 400 వాహనాలకు పైగా సరఫరా చేసిన అనుభవం కంపెనీకి ఉంది. ప్రభుత్వ వివరాల మేరకు... మీడియం, హెవీ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో ఈవీలు 2018 లోని 124 నుంచి ఇప్పుడు 1,356 కు పెరిగాయి. కార్గో రవాణా కోసం రిజిస్టరైన విద్యుత్తు వాహనాల సంఖ్య 2018 లోని 6,246 నుంచి 2021 లో 27,645 కు చేరాయి. ప్రభుత్వం కూడా త్వరలోనే 65 నగరాల్లో 6,200 విద్యుత్తు  బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సెగ్మెంట్‌ ప్లేయర్లకు ఇది రూ. 8 వేల కోట్ల వ్యాపారంగా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు. 


బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ కోసం దాదాపు 300 విద్యుత్తు  బస్సులు సరఫరా చేసి, ఆపరేట్‌ చేయనున్నట్లు స్విచ్ సంస్థ ప్రకటించింది. వచ్చే 3-5 సంవత్సరాల్లో విద్యుత్తు వాహనాలు ప్రధానాంశంగా మారతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో... ప్రజా రవాణాపరంగా ఓఈఎంలకు భారీ అవకాశాలుంటాయని అంచనా. స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యుటిలిటీస్‌, ఓఈఎం... రెంటికీ  ఇది లాభమే. విద్యుత్తు వాహనాల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. వీటిని ఎక్కువ కాలం నడిపినప్పటికీ... పెట్టుబడి తిరిగి వస్తుందని స్విచ్ మొబిలిటీ చెబుతోంది. విద్యుత్తు బస్సులను తిప్పడానికి ప్రతి కిలోమీటరు దూరానికయ్యే  ఖర్చు రూ. 48-50 కాగా, కంప్రెస్డ్ నేచురల్‌ గ్యాస్‌కు రూ. 70-90, డీజిల్‌కు రూ. 100 వ్యయమవుతుంది. స్పెయిన్ ద్వారా యూరప్ మార్కెట్‌లోకి దూకుడుగా అడుగేసి, తర్వాత ఆసియా, ఆఫ్రికా, చైనా మినహా ఆగ్నేయాసియా,   పశ్చిమ ఆసియా, జపాన్‌కు విస్తరించాలన్నది కంపెనీ ప్రణాళిక. 

Updated Date - 2021-11-19T06:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising