ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీని ఖరీదు... రూ. 72 ల‌క్ష‌లు... కారణమిదే...

ABN, First Publish Date - 2021-06-01T22:31:48+05:30

చేప ఖరీదు రూ. 72 లక్షలా ? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే మరి. ఎందుకంత ఖరీదంటే... సమాధానమేమిటంటే... ఆ చేప ఇంట్లో ఉంటే ‘అదృష్టం’ తన్నుకుంటూ వస్తుందట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ : చేప ఖరీదు రూ. 72 లక్షలా ? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే మరి. ఎందుకంత ఖరీదంటే... సమాధానమేమిటంటే... ఆ చేప ఇంట్లో ఉంటే ‘అదృష్టం’ తన్నుకుంటూ వస్తుందట. అందుకే... మరి అంత ఖరీదు. ఇక విషయానికొస్తే...  పాకిస్తాన్ కు చెందిన సాజిద్ హాజీ, అబు బ‌క‌ర్ అనే వ్య‌క్తులు స‌ముద్రంలో చేప‌ల వేట‌తో జీవ‌నం గ‌డుపుతుంటారు.  చాలా కాలంగా చేప‌ల వేట‌తో జీవ‌నం సాగిస్తున్న వీరికి... ఆ సముద్రమే అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 


అరుదైన‌, విలువైన చేప వీరి వ‌ల‌కు చిక్కింది.  ‘అట్లాంటిక్ క్రోక‌ర్’ అనే అరుదైన‌, విలువైన చేప‌ ఇది. ఆసియా, యూర‌ప్ దేశాల్లో దీనికి గిరాకి ఎక్కువ‌.  దాదాపు 48 కిలోల బరువుండే ఈ ఈ చేప‌ను రూ. 72 లక్ష‌ల‌కు అమ్మేశారు. ఆ చేప ఇంట్లో ఉంటే అదృష్టమెలా వస్తుందో తెలియదు కానీ... ఆ ఇద్దరికీ ‘అదృష్టం’ అలా ఎదురైంది మరి. వాస్తవానికి... వేలంలో ఈ చేప రూ. 84.2 ల‌క్ష‌లు పలికిన‌ప్ప‌టికి, సాంప్రదాయం ప్ర‌కారం ‘రాయితీ’నివ్వడంతో రూ. 72 లక్షలు మాత్రం వారి సొంతమయ్యాయి. 

Updated Date - 2021-06-01T22:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising