ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు

ABN, First Publish Date - 2021-06-12T06:06:41+05:30

ఐటీ, ఫార్మా, ఇంధన రంగ షేర్ల కొనుగోళ్ల దన్నుతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త రికార్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

174 పాయింట్ల లాభంతో   52,475 వద్ద ముగింపు 

 15,800 స్థాయికి నిఫ్టీ 

 రూ.231 లక్షల కోట్లకు  బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ 


ముంబై: ఐటీ, ఫార్మా, ఇంధన రంగ షేర్ల కొనుగోళ్ల దన్నుతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. వారాంతం ట్రేడింగ్‌లో బీఎ స్‌ఈ సెన్సెక్స్‌ ఒక దశలో 341 పాయింట్ల వరకు పెరిగి 52,641.53 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసుకుంది. చివరికి 174.29 పాయింట్ల లాభంతో 52,474. 76 వద్ద కొత్త రికార్డు ముగింపును  నమోదు చేసుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 61.60 పాయింట్ల పెరుగుదలతో 15,799. 35 వద్దకు ఎగబాకింది.  కాగా బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) రూ.231 లక్షల కోట్లు దాటింది. గడిచిన రెండు రోజుల్లోనే రూ.3.26 లక్షల కోట్లు పెరిగింది. ఈ వారం మొత్తానికి సెన్సెక్స్‌ 374.71, నిఫ్టీ 129.10 పాయింట్లు లాభపడ్డాయి. 



 ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ ట్రెండ్స్‌ 


 జనవరి 21న ఇంట్రాడేలో 50,000 మైలురాయి


 ఫిబ్రవరి 3న 50 వేల ఎగువ స్థాయిలో ముగిసింది


 ఫిబ్రవరి 5న ఇంట్రాడేలో 51,000 మార్క్‌ను తాకింది


 ఫిబ్రవరి 8న 51 వేల ఎగువ స్థాయిలో ముగిసింది


 ఫిబ్రవరి 15న 52,000 మైలురాయిని అధిగమించింది 


 మే 24న బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌    3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది 


ఈ ఏడాదిలో ఇప్పటివరకు సూచీ 4,723.43 పాయింట్లు (9.89 శాతం) లాభపడింది.


Updated Date - 2021-06-12T06:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising