ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూసుకుపోయిన సేవల రంగం

ABN, First Publish Date - 2021-03-04T06:06:08+05:30

భారత సేవల రంగం ఫిబ్రవరి నెలలో ఏడాది కాలంలో కనివిని ఎరుగని రీతిలో దూసుకుపోయింది. సేవల రంగం పీఎంఐ 52.8 పాయింట్ల నుంచి 55.3 పాయింట్లకు చేరింది. సేవలు, తయారీ రంగం రెండింటి తాజా స్థితిని తెలియచేసే కాంపోజిట్‌ పీఎంఐ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత సేవల రంగం ఫిబ్రవరి నెలలో ఏడాది కాలంలో కనివిని ఎరుగని రీతిలో దూసుకుపోయింది. సేవల రంగం పీఎంఐ 52.8 పాయింట్ల నుంచి 55.3 పాయింట్లకు చేరింది. సేవలు, తయారీ రంగం రెండింటి తాజా స్థితిని తెలియచేసే కాంపోజిట్‌ పీఎంఐ కూడా 55.8 పాయింట్ల నుంచి 57.3 పాయింట్లకు చేరింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడం వ్యాపార విశ్వాసాన్ని ఇనుమడింపచేసిందని, సేవలు, తయారీ రంగాలు రెండూ మంచి వృద్ధిని నమోదు చేయడానికి ఇదే కారణమని పరిశీలకులంటున్నారు. నాలుగో త్రైమాసికంలో మరింత వేగవంతమైన రికవరీ ఉంటుందనేందుకు పీఎంఐ సూచీల్లో భారీ వృద్ధి సంకేతమని కూడా వారన్నారు. తాజాగా కేసులు పెరుగుతూ ఉండడం కొంత ఆందోళనకరమైన అంశమని, ఇప్పటివరకు సాధించిన పురోగతి ప్రమాదంలో పడవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. సేవల రంగంలో కొత్త వ్యాపారాలు పెరిగినప్పటికీ స్థూల వ్యయాలు గణనీయంగా పెరిగినట్టు కంపెనీలు భావిస్తున్నాయని, ఉపాధి రేటు కూడా మరింత క్షీణించిందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ సంస్థ తెలిపింది. 

Updated Date - 2021-03-04T06:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising