ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగని రికార్డుల మోత

ABN, First Publish Date - 2021-08-06T06:52:42+05:30

దేశీయ స్టాక్‌ మార్కెట్లో రికార్డుల మోత మోగుతోంది. వరుసగా నాలుగో రోజూ సూచీలు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సరికొత్త శిఖరాలకు సూచీలు 
  • సెన్సెక్స్‌ 123 పాయింట్లు అప్‌ 

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో రికార్డుల మోత మోగుతోంది. వరుసగా నాలుగో రోజూ సూచీలు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. ఐటీ, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్లు నేటి ర్యాలీకి దోహదపడ్డాయి. రూపాయి బలోపేతం, విదేశీ పెట్టుబడులూ మార్కెట్‌ జోరుకు కలిసివచ్చాయి. గురువారం నాడు బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 54,717.24 వద్ద, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 16,349.45 వద్ద సరికొత్త ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేసుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 123.07 పాయింట్ల లాభంతో 54,492.84 వద్ద.. నిఫ్టీ 35.80 పాయింట్ల లాభంతో 16,294.60 వద్ద స్థిరపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 4.30 శాతం లాభంతో సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐటీసీ 3.14 శాతం పుంజుకోగా.. టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు 2 శాతానికి పైగా బలపడ్డాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు ముందు జాగ్రత్త వహించారు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. 


దీంతో ఎస్‌బీఐ షేరు 3.33 శాతం క్షీణించి సెన్సెక్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 2.13 శాతం కోల్పోగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు ఒక శాతానికిపైగా మార్కెట్‌ కోల్పోయాయి. రంగాలవారీగా చూస్తే, బీఎ్‌సఈలోని టెలికాం, మెటల్‌, టెక్నాలజీ, ఎనర్జీ, ఐటీ సూచీలు 3.39 శాతం వరకు ఎగబాకాయి. 

Updated Date - 2021-08-06T06:52:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising