ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీఎస్‌ ఫైలింగ్‌కు నెలాఖరు వరకే గడువు

ABN, First Publish Date - 2021-06-20T09:26:35+05:30

వచ్చే నెల నుంచి కొందరు పన్ను చెల్లింపుదారులు అధిక టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) చెల్లించాల్సి రావచ్చు. గడిచిన రెండేళ్లలో ఏటా రూ.50,000కు పైగా టీడీఎస్‌ మినహాయించుకొని లేదా వసూలు చేసి, ఆ రెండేళ్లూ ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయకపోయి ఉంటే, జూలై 1 నుంచి ఆదాయ పన్ను శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలస్యమైతే రెట్టింపు చెల్లించాల్సి రావచ్చు.. 


న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి కొందరు పన్ను చెల్లింపుదారులు అధిక టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) చెల్లించాల్సి రావచ్చు. గడిచిన రెండేళ్లలో ఏటా రూ.50,000కు పైగా టీడీఎస్‌ మినహాయించుకొని లేదా వసూలు చేసి, ఆ రెండేళ్లూ ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయకపోయి ఉంటే, జూలై 1 నుంచి ఆదాయ పన్ను శాఖ రెట్టింపు టీడీఎస్‌ వసూలు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్‌ 2021లో కొత్త సెక్షన్లు 206ఏబీ, 206సీసీని ప్రవేశపెట్టింది. 


ఆలస్యంగా రిటర్నులు సమర్పించే వారిపై చర్యలు చేపట్టడమే ఈ సెక్షన్ల ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ గడువు తేదీని జూలై 31 నుంచి సెప్టెంబరు 31 వరకు పొడిగించింది. పద్దుల ఆడిటింగ్‌ అవసరమైన కంపెనీలు, వ్యాపారాలకు రిటర్నుల ఫైలింగ్‌ గడువును అక్టోబరు 31 నుంచి నవంబరు 30కి పొడిగించింది. అలాగే, ఈ జనవరి-మార్చి త్రైమాసికానికి టీడీఎస్‌ ఫైలింగ్‌ గడువును సైతం మే 31 నుంచి జూన్‌ 30కి పొడిగించింది. 


రెట్టింపు టీడీఎస్‌ వర్తించని లావాదేవీలు, వ్యక్తులు.. 

  • జీతాలు, పీఎఫ్‌ అడ్వాన్స్‌పై మినహాయించిన టీడీఎస్‌
  • కార్డ్‌ గేమ్‌, క్రాస్‌వర్డ్‌, లాటరీ, పజిల్స్‌, గుర్రం పందెంలో గెలిచిన సొమ్ముపైన టీడీఎస్‌
  • సెక్షన్‌ 194ఎన్‌ కింద రూ.కోటికి పైగా నగదు విత్‌డ్రాపై టీడీఎస్‌ 
  • సెక్షన్‌ 194ఎల్‌బీసీ కింద సెక్యూరిటైజేషన్‌ ట్రస్ట్‌లో పెట్టుబడులపై లభించిన ఆదాయంపై టీడీఎస్‌ 
  • భారత్‌లో ఎలాంటి శాశ్వత ఏర్పాట్లు లేని ప్రవాస భారతీయులకు

Updated Date - 2021-06-20T09:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising