ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం కోర్టులో ఆ సంస్థలకు భారీ షాక్

ABN, First Publish Date - 2021-07-23T21:10:50+05:30

త కొంత కాలంగా వార్తలకెక్కుతున్న ‘అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) బకాయిలకు సంబంధించి టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : గత కొంత కాలంగా వార్తలకెక్కుతున్న ‘అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) బకాయిలకు సంబంధించి టెలికం కంపెనీలకు  సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించాలని విజ్ఞప్తి చేసిన భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ హృషికేష్ రాయ్‌‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.


అనంతరం టెల్కోస్ అభ్యర్థనకు ‘నో’ చెప్పింది. ఏజీఆర్ ఛార్జీల లెక్కింపునకు డిపార్ట్ ఆఫ్ టెలికం(డీఓటీ) అనుసరిస్తున్న విధానంలో దోషాలున్నాయని టెలికం సంస్థలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వాటిని పక్కనపెట్టి లెక్కిస్తే ఏజీఆర్ ఛార్జీలు తగ్గుతాయని చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏజీఆర్ ఛార్జీలను తిరిగి లెక్కించేలా డీఓటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టెలికం సంస్థలు కోర్టునాశ్రయించాయి.యి. ఈ నేపధ్యంలో... ఆయా సంస్థల అభ్యర్ధనను తిరస్కరిస్తూ తీర్పును వెల్లడించింది. 

Updated Date - 2021-07-23T21:10:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising