ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌కు రిలయన్స్‌ దన్ను

ABN, First Publish Date - 2021-11-26T09:22:17+05:30

మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో భారీగా కొనుగోళ్లు ప్రామాణిక ఈక్విటీ సూచీలను లాభాల్లోకి మళ్లించాయి. ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు షార్‌ ్టకవరింగ్‌కు పాల్పడటం కూడా గురువారం మార్కెట్‌కు కలిసివచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 6% ఎగబాకిన ఆర్‌ఐఎల్‌ షేరు..
  • 454 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 


ముంబై: మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో భారీగా కొనుగోళ్లు ప్రామాణిక ఈక్విటీ సూచీలను లాభాల్లోకి మళ్లించాయి. ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు షార్‌ ్టకవరింగ్‌కు పాల్పడటం కూడా గురువారం మార్కెట్‌కు కలిసివచ్చింది. అయితే, రూపాయి క్షీణత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు మాత్రం సూచీల లాభాలకు అడ్డుకట్ట వేశాయి. అయినప్పటికీ, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 454.10 పాయింట్లు పెరిగి 58,795.09 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121.20 పాయింట్లు బలపడి 17,536.25 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ షేర్లలో రిలయన్స్‌ 6.10 శాతం లాభపడి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. జామ్‌నగర్‌లోని గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టు ఆస్తుల విలువను పెంచేందుకు ఆ ప్రాజెక్టు ఆస్తులను తన పూర్తి అనుబంధ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు రిలయన్స్‌ ప్రకటించడం ఇందుకు దోహదపడింది. సూచీలోని మిగతా కంపెనీల విషయానికొస్తే.. ఐటీసీ, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు మాత్రం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. 


43 నెలల గరిష్ఠానికి పీ-నోట్‌ పెట్టుబడులు: గతనెలాఖరు నాటికి దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్‌) ద్వారా పెట్టుబడులు 43 నెలల గరిష్ఠ స్థాయి రూ.1.02 లక్షల కోట్లకు పెరిగాయి. సెబీ వద్ద రిజిస్టర్‌ చేసుకోని విదేశీ ఇన్వెస్టర్లు సైతం భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు పీ-నోట్స్‌ వీలు కల్పిస్తాయి. రిజిస్టర్డ్‌ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) వీటిని జారీ చేస్తారు. 

Updated Date - 2021-11-26T09:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising