ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

ABN, First Publish Date - 2021-05-07T21:40:28+05:30

వరుసగా మూడో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుసగా మూడో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. 49,169 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 256 పాయింట్లు లాభపడి 49,206 వద్ద ముగిసింది. ఇక, నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. 14,816 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 98 పాయింట్లు ఎగబాకి 14,823 వద్ద స్థిరపడింది. 


టాటా స్టీల్, హిందోల్కా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్ లాభాలతో ముగిశాయి. టాటా కన్సూమర్ ప్రోడక్ట్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఎయిచర్ మోటార్స్ నష్టాలను చవిచూశాయి. లోహ, ఆర్థిక, టెలికాం రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు దన్నుగా నిలిచింది. అలాగే అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కూడా కలిసొచ్చాయి. కరోనా వ్యాక్సిన్‌‌లకు పేటెంట్ హక్కులను రద్దు చేయాలన్న భారత్ ప్రతిపాదనకు అమెరికా అంగీకరించడం మదుపర్లను మెప్పించింది. పేటెంట్ హక్కులు లేకపోతే వ్యాక్సిన్ సరఫరా మెరుగుపడి అందరికీ వ్యాక్సిన్ త్వరగా అందుతుందనే సెంటిమెంట్ పనిచేసింది. 


Updated Date - 2021-05-07T21:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising