ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 70 వేలతో స్టార్టయ్యాడు... రూ. 300 కోట్లు సంపాదించాడు...

ABN, First Publish Date - 2021-02-23T20:55:11+05:30

బిజినెస్ లో సక్సెస్సైన వారి స్టోరీలు చాలాసార్లు విని ఉంటాం. మనకు తెలిసిన పరిధిలోనే... ఇలా సక్సెసైన వారినెందరినో చూసి ఉంటాం. ఇదీ అలాంటి సక్సెస్ స్టోరీయే. చదవండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : బిజినెస్ లో సక్సెస్సైన వారి స్టోరీలు చాలాసార్లు విని ఉంటాం. మనకు తెలిసిన పరిధిలోనే... ఇలా సక్సెసైన వారినెందరినో చూసి ఉంటాం. ఇదీ అలాంటి సక్సెస్ స్టోరీయే. చదవండి...


జతిన్ అహుజా... ఈ పేరు వినే ఉంటారు. ఇతని వ్యాపారోత్పత్తుల పేర్లు చెబితే మాత్రం వెంటనే గుర్తు పడతారు. బిగ్ బాయ్ టాయ్స్ వ్యవస్థాపకుడీయనే. కిందటి సంవత్సరం ఏప్రిల్ నెలలో లాక్ డౌన్ కారణంగా ఒక్క కొత్త కారు అమ్మకం కూడా జరగలేదు. కానీ ఈయన మాత్రం 12 సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను విక్రయించాడు. వీటి విలువ రూ. 13 కోట్లు. ముంబై, గురుగ్రామ్, హైదరాబాద్‌ల్లో కంపెనీ షోరూమ్‌లున్నాయి.


అహుజా 23 ఏళ్ల వయసులో బీబీటీ కంపెనీని స్టార్ట్ చేశారు. లగ్జరీ కార్లను చాలా మందికి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించాడు. మెకానికల్ ఇంజినీరింగ్, ఆ తర్వాతీ ఎంబీఏ చదివాడు. ఆ వెంటనే... వ్యాపారం మొదలుపెట్టాడు.  తండ్రి దగ్గర 2009 లో రూ. 70 వేలు అప్పుగా తీసుకుని ఢిల్లీలో చిన్న షోరూంను తెరిచాడు. దానిని వృద్ధిలోకి తెచ్చేందుకు అహుజా తీవ్రంగా శ్రమించాడు. సక్సెస్సయ్యాడు. ఇప్పుడీయన కింద  150 మంది  పని చేస్తున్నారు.


ఇక అహుజా ఈ వ్యాపారంలో ఇప్పటివరకు రూ.300 కోట్లు సంపాదించాడు. కోహ్లీ, రోహిత్, ప్రీతి జింటాలతోపాటు మరెందరో ప్రముఖులు ఈయన కస్టమర్లే. ఈయన సక్సెస్ స్టోరీ నిజంగా స్ఫూర్తవంతమే కదా..! 

Updated Date - 2021-02-23T20:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising