ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలిచిపోయిన వైట్‌కాలర్ నియామకాలు... హైదరాబాద్ సహా ఐదు నగరాల్లో స్తబ్దత...

ABN, First Publish Date - 2021-04-02T22:12:52+05:30

కరోనా కేసులు, లాక్‌డౌన్ నేపధ్యంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా కేసులు, లాక్‌డౌన్ నేపధ్యంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం కనిపిస్తోంది. టాప్ ఫైవ్ మెట్రో నగరాల్లో హైరింగ్ రికవరీ కూడా దాదాపు నిలిచిపోయింది. కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ ఆంక్షల నేపధ్యంలో ఐదు మెట్రో నగరాల్లో నియామక రికవరీపై ప్రభావం పడిందని, ప్రధానంగా వైట్ కాలర్ ఉద్యోగాలపై ఎక్కువగా కనిపించిందని చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో లక్షలాది వైట్ కాలర్ నియామకాలు నిలిచిపోయాయి.


నియామకాల స్తబ్దత...

ఈ ఐదు మెట్రో నగరాల్లోనే గత సంవత్సర కాలంలో 10 లక్షల నియామకాలు నిలిచిపోయాయి. ఇది ఏడాది నియామకాల్లో 40 శాతం. యాక్టివ్ వైట్ కాలర్ నియామకాల్లో స్తబ్దత కనిపించిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో 11 శాతం పెరుగుదల నమోదు చేసిన ఈ మెట్రో నగరాలు, మార్చి నెలలో స్వల్పంగా ఒక్క శాతం వృద్ధిని మాత్రమే కనబరిచాయి. వృద్ధి ఏటవాలుగా ఉంటుందని భావించినప్పటికీ, నియామక ప్రక్రియ పేలవమైన సంకేతంగా చెబుతున్నారు.


 అందుకే ఇలా...

ఓ అంచనా ప్రకారం మార్చి చివరి రెండు వారాలు సెకండ్ వేవ్ కారణంగా నియామక సెంటిమెంట్ బలహీనపడింది.జాబ్ పోస్టింగ్స్ మందగమనం అంతకుముందు రెండు వారాల్లో చోటు చేసుకుందని చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ భయాలు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్, టీకా ప్రభావంపై చర్యలు తదితరాంశాలు నియామక ప్రక్రియ మందగమనానికి దారితీసినట్లు చెబుతున్నారు.


తాత్కాలిక విరామం...

కరోనా కారణంగా విమానయాన సంస్థలు, ఆతిథ్యం, లార్జ్ ఫామ్ రిటైల్, వినోదం రంగాలు కిందటేడాది తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా... కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ నేపధ్యంలో నియామకాలు కాస్త పుంజుకున్నట్లు కనిపించాయి. అయితే ఇటీవల మళ్లీ నెమ్మదించాయి. కంపెనీలు కాస్త అప్రమత్తంగా ఉండటంతో తాత్కాలిక విరామం కనిపిస్తోందని చెబుతున్నారు.

Updated Date - 2021-04-02T22:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising