ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 29 న హైదరాబాద్ లో ప్రారంభం కానున్న ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్

ABN, First Publish Date - 2021-07-28T21:24:48+05:30

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. రూ. 1,200 కోట్లుతో ఓయూనిట్ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీస్ అంగీకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. రూ. 1,200 కోట్లుతో ఓయూనిట్ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీస్ అంగీకరించింది. సౌర విద్యుదుత్పత్తి పరికరాల తయారీ కంపెనీ ‘ప్రీమియర్‌ ఎనర్జీస్‌’... హైదరాబాద్‌లో నెలకొల్పిన కొత్త ప్లాంటును ఈ నెల 29 న ప్రారంభించనుంది. రూ. 483 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ను గురువారం  కేటీఆర్ ప్రారంభించనున్నారు.


దీనితోపాటు విస్తరణ ప్రాజెక్టు కూడా హైదరాబాద్ లోనే ఉండనుందని, ఇందుకుగాను మరో రూ. 1,200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు  సంస్థ వెల్లడించింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ యూనిట్ 750 మెగావాట్ల సోలార్‌ సెల్స్‌, 750 మెగావాట్ల సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాంటులో ఎంసీసీఈ టెక్చర్డ్‌ మల్టీ-క్రిస్టల్లీన్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌, మోనో పీఈఆర్‌సీ సెల్స్‌, మాడ్యూల్స్‌, పాలీక్రిస్టల్లీన్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ ఉత్పత్తి కానున్నాయి. రూ. 1,200 కోట్ల పెట్టుబడులతో వచ్చే రెండేళ్ళలో ఉత్పాదక సామర్థ్యాన్ని 3 గిగావాట్లకు విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లోనే రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్‌ సామర్థ్యాన్ని పెంచుతామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 500 కోట్లు పెట్టుబడి పెడుతామని తెలిపింది. మొత్తంమీద వచ్చే రెండేండ్లలో రూ. 1,000-1,200 కోట్ల వరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది. 

Updated Date - 2021-07-28T21:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising