ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అద్దె’కు... ‘స్మార్ట్‌ఫోన్’...

ABN, First Publish Date - 2021-07-16T20:46:39+05:30

స్మార్ట్‌ఫోన్‌ను అద్దెకు తీసుకోవచ్చు. అది కూడా తక్కువ మొత్తానికే. కొన్ని వెబ్‌సైట్లు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : స్మార్ట్‌ఫోన్‌ను అద్దెకు తీసుకోవచ్చు. అది కూడా తక్కువ మొత్తానికే. కొన్ని వెబ్‌సైట్లు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. రెంట్ ద్వారా ఫోన్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. వివరాలిలా ఉన్నాయి. పేటీఎం మాల్, రెంటోమోజో, ఫ్లెక్స్‌ఇట్‌రెంట్ వంటి సైట్లు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అతి తక్కువ నెలవారీ అద్దెతో నచ్చిన మొబైల్ ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. అంతేకాకుండా... వారం రోజులపాటు ఫ్రీ ట్రయల్ ఫెసిలిటీని కూడా పొందొచ్చు. ఆరు నెలల నుంచి 12 నెలల వరకు ఫోన్‌ను అద్దెకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. 


రెడ్‌మి నోట్6 ప్రో ఫోన్‌కు నెలకు రూ. 369 చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదిపాటు ఇది వర్తిస్తుంది. అయితే రూ. 719 మొత్తాన్ని ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఈ డబ్బును వెనక్కిచ్చేస్తారు. అదే వన్‌ప్లస్ 7 ప్రో ఫోన్‌కు అయితే నెలకు రూ. 1519 చెల్లించాలి. యాపిల్ ఐఫోన్ 10 ఫోన్ కు రూ. 2869 కట్టాలి. ఫోన్ విలువ ప్రాతిపదికన సెక్యూరిటీ డిపాజిట్ డబ్బు మొత్తం కూడా మారుతుంటుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫోన్ కోసం నెలకు రూ. 1949 చెల్లించాలి. గెలాక్సీ ఎస్10 ఫోన్ ఇంటికి తీసుకెళ్లాలంటే నెలకు రూ. 1,639 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-07-16T20:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising