ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసిడి పడింది

ABN, First Publish Date - 2021-03-03T06:27:03+05:30

దేశీయ స్టాక్‌ మార్కెట్లో వరుసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగింది. దీంతో సెన్సెక్స్‌ మళ్లీ కీలకమైన 50,000 పాయింట్లపైన ముగిసింది. ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఒక దశలో 633 పాయింట్లు దూసుకుపోయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

45వేల దిగువకు బంగారం

మళ్లీ 50,000కు సెన్సెక్స్‌


ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లో వరుసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగింది. దీంతో సెన్సెక్స్‌ మళ్లీ కీలకమైన 50,000 పాయింట్లపైన ముగిసింది. ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఒక దశలో 633 పాయింట్లు దూసుకుపోయింది. చివరికి 447.05 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 50,296.89 వద్ద ముగియగా నిఫ్టీ 157.55 పాయింట్ల లాభం తో 14,919.10 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 25 కంపెనీల షేర్లు లాభాలతో ముగిశాయి. 


రూ.45,000 దిగువకు పసిడి

బులియన్‌ మార్కెట్‌ మంగళవారం మరోసారి చతికిలపడింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్‌) బంగారం ధర రూ.679 తగ్గి రూ.44,760 వద్ద ముగిసింది. కిలో వెండి ధర ఏకంగా రూ.1,847 తగ్గి రూ.67,073కు చేరింది. ముంబై బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.457 క్షీణించి రూ.45,509 వద్ద ముగియగా కిలో వెండి రూ.1,113 తగ్గి రూ.67,353 వద్ద క్లోజైంది.

Updated Date - 2021-03-03T06:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising