ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీఐ గృహ రుణ రేటు పెంపు

ABN, First Publish Date - 2021-04-04T05:48:58+05:30

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా).. ఈ నెల 1 నుంచి గృహ రుణాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈనెల 1 నుంచి 6.95 శాతం‌‌‌


ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా).. ఈ నెల 1 నుంచి గృహ రుణాల కనీస వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దాంతో కనీస వడ్డీ రేటు 6.70 శాతం నుంచి 6.95 శాతానికి పెరిగింది. ఎస్‌బీఐని అనుసరిస్తూ, మిగతా బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.


గత నెల 1న ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ కనీస రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది. ఈ పరిమిత కాల ఆఫర్‌ మార్చి 31తో ముగిసింది. గత నెల ఆఫర్‌లో భాగంగా మినహాయించిన గృహ రుణ ప్రాసెసింగ్‌ రుసుమును బ్యాంక్‌ ఈ నెల 1 నుంచి మళ్లీ వసూలు చేస్తోంది. గృహ రుణ మొత్తంపై 0.40 శాతం ప్రాసెసింగ్‌ రుసుముగా (కనీసం రూ.10,000- గరిష్ఠం రూ.30,000కు జీఎ్‌సటీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. 


Updated Date - 2021-04-04T05:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising