ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంసంగ్ అభిమానులకు శుభవార్త!

ABN, First Publish Date - 2021-04-06T23:36:22+05:30

శాంసంగ్ అభిమానులకు ఇది గొప్ప శుభవార్తే. భారత్‌లో ‘గెలాక్సీ ఎ31’ ధరను 1000 రూపాయలు తగ్గిస్తున్నట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: శాంసంగ్ అభిమానులకు ఇది గొప్ప శుభవార్తే. భారత్‌లో ‘గెలాక్సీ ఎ31’ ధరను 1000 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్‌కు సక్సెసర్‌గా శాంసంగ్ గెలాక్సీ ఎ32ను తీసుకొచ్చిన కొన్ని వారాల్లోనే గెలాక్సీ ఎ31 ధరను తగ్గించడం గమనార్హం. అలాగే, శాంసంగ్ గెలాక్సీ ఎ32కు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఇది ఇప్పటికే ఉన్న క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అదనం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా కానీ, జెస్ట్ మనీ ద్వారా కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 21,999 మాత్రమే. 


శాంసంగ్ గెలాక్సీ ఎ31 ధర 

శాంసంగ్ గెలాక్సీ ఎ31 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 16,999 మాత్రమే. ఆఫర్‌కు ముందు దీని ధర రూ. 17,999. అంటే వెయ్యి రూపాయల తగ్గింపు అన్నమాట. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌లు) ద్వారా కొనుగోలు చేసే వారికి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 


శాంసంగ్ గెలాక్సీ ఎ32 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ 

గెలాక్సీ ఎ31 ధర తగ్గింపునకు తోడు గెలాక్సీ ఎ32పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను గెలాక్సీ ఎ32తో మార్చుకోవచ్చని శాంసంగ్ పేర్కొంది. ఇలా చేసుకునే వినియోగదారులకు తమ పాత హ్యాండ్స్‌సెంట్ అదనంగా రూ. 3 వేల విలువైన అప్‌గ్రేడ్ వోచర్ లభిస్తుందని తెలిపింది.


తమ పాత ఫోన్ అసలు విలువను ‘మై గెలాక్సీ’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. అలాగే, శాంసంగ్ గెలాక్సీ ఎ32ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ. 2వేల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈఎంఐలో కొనుగోలు చేసే వారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. జెస్ట్ మనీ ద్వారా చేసే లావాదేవీలపై రూ. 1500 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు వివరించింది. 


శాంసంగ్ గెలాక్సీ ఎ32 మార్చిలో విడుదలైంది. 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ కన్ఫిగరేషన్ సింగిల్ వేరియంట్ ధర రూ. 21,999 మాత్రమే. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరాలు, డాల్బీ అట్‌మోస్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.  

Updated Date - 2021-04-06T23:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising