ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపాయి హై జంప్‌

ABN, First Publish Date - 2021-03-04T06:05:28+05:30

ఫారెక్స్‌ మార్కె ట్లో రూపాయి ఒక్క రోజులోనే 65 పైసలు దూసుకుపోయింది. గత 6 నెలల కాలంలో రూపాయి సాధించిన అతి పెద్ద ర్యాలీ ఇది. అమెరికన్‌ డాలర్‌ బలహీనతతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఏర్పడిన ర్యాలీ, ఎఫ్‌పీఐ పెట్టుబడుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్క  రోజులో 65 పైసలు లాభం


ముంబై: ఫారెక్స్‌ మార్కె ట్లో రూపాయి ఒక్క రోజులోనే 65 పైసలు దూసుకుపోయింది. గత 6 నెలల కాలంలో రూపాయి సాధించిన అతి పెద్ద ర్యాలీ ఇది. అమెరికన్‌ డాలర్‌ బలహీనతతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఏర్పడిన ర్యాలీ, ఎఫ్‌పీఐ పెట్టుబడుల మద్దతు, క్రూడాయిల్‌ ధరల తగ్గుదల రూపాయి దూకుడుకు దోహదపడ్డాయి. వర్తమాన త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 500 కోట్ల డాలర్లు భారత ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు. సర్వత్రా సానుకూలతల కారణంగా బుధవారం ఉదయం అమెరికన్‌ డాలర్‌ మారకంలో 73.26 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 72.71 వరకు దూసుకుపోయి చివరికి 72.72 వద్ద ముగిసింది. గత ఏడాది సెప్టెంబరు ఒకటో తేదీన ఏర్పడిన ర్యాలీలో 73 పైసలు లాభపడిన అనంతరం సాధించిన పెద్ద లాభం ఇదే. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్‌ బ్యారెల్‌ 1.69 శాతం క్షీణించి 63.76 డాలర్లకు దిగివచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో రూపాయి 72.75-73.25 మధ్యన కదలాడవచ్చునని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ అంచనా.

Updated Date - 2021-03-04T06:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising