ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్వాక్రా గ్రూపులకు ఇక రూ. 20 లక్షల వరకు రుణం... కొత్త రూల్స్ నోటిఫై...

ABN, First Publish Date - 2021-08-10T22:30:24+05:30

ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్‌ను నోటిఫై చేసింది. ఈ క్రమంలో... ఇకపై స్వయం సహాయక(డ్వాక్రా) గ్రూపులకు ఎటువంటి తనఖా లేకుండానే, అది కూడా రూ. 20 లక్షల వరకు రుణం లభించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్‌ను నోటిఫై చేసింది. ఈ క్రమంలో... ఇకపై స్వయం సహాయక(డ్వాక్రా) గ్రూపులకు ఎటువంటి తనఖా లేకుండానే, అది కూడా రూ. 20 లక్షల వరకు రుణం లభించనుంది. ఇప్పటివరకు ఈ పరిమితి రూ. 10 లక్షలే. ‘దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన‌- నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌’లో భాగంగా ఆర్‌బీఐ ఈ వెసులుబాటు కల్పించింది. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ అంత్యోదయ యోజన పథకాన్నందిస్తోన్న విషయం తెలిసిందే. పేదరిక నిర్మూలన దీని ప్రధాన లక్ష్యం. ప్రత్యేకించి మహిళలకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది.


ఈ క్రమంలో... మహిళలను కేంద్ర ప్రభుత్వం స్వయం సమృద్ధి దిశగా నడిపించనుంది. కాగా... ఆర్‌బీఐ కొత్త విధానం ప్రకారం... స్వయం సహాయక గ్రూపులకు రుణాలు మంజూరు చేసే సందర్భాల్లో బ్యాంకులు... డిపాజిట్లను పట్టుకోకూడదు. అంతేకాకుండా... వారి సేవింగ్స్ ఖాతాలపై ఎలాంటి ఆంక్షలూ విధించకూడదు. ఇక... రుణాల మంజూరు సమయంలో ఎలాంటి మార్జిన్ కూడా తీసుకోకూడదు. ఇక... రూ. 10 లక్షలలోపు రుణ మొత్తానికి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ కవరేజ్ లభించనుండడం గమనార్హం. 

Updated Date - 2021-08-10T22:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising