ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆ’ ట్వీట్‌కు రూ. 18.30 కోట్లు...

ABN, First Publish Date - 2021-03-07T20:32:11+05:30

‘ఆ’ ట్వీట్‌కు రూ. 18.30 కోట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాన్‌ఫ్రాన్సిస్‌కో : 'జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్' అంటూ 2006 మార్చి 21 న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ చేసిన తొట్టతొలి ట్వీట్‌‌కు భారీ ధర పలికింది. ఈ ట్వీట్ ను అమ్మకానికి పెట్టారు. 


దీనిని జాక్ డోర్సీ 'వాల్యుయబుల్స్ బై సెంట్' వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని  ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కాగా...  ఈ ట్వీట్ కొనుగోలుకు లక్షల మంది మొగ్గు చూపడం విశేషం.  బిడ్స్ కూడా పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం గమనార్హం. మన కరెన్సీలో ఇది రూ. 18.30 కోట్లు. 


ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్‌గా వెరిఫై చేసి, సంతకం చేసిన ఓ ధ్రువపత్రాన్ని అందిస్తారు. ఆ పత్రంలో... ట్వీట్‌తో పాటు దానిని పోస్ట్ చేసిన సమయం తదితర వివరాలుంటాయి. ఈ ట్వీట్‌కు ఎంతోమంది లక్షల రూపాయలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.

Updated Date - 2021-03-07T20:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising